తనాక్ లోని రాబోవు కారణజన్ములు
దాదాపు వెయ్యి సంవత్సరాల కాలపరిధిలో వ్రాయబడిన హీబ్రూ మరియు అరామిక్ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము (తనాక్) లో రాబోవు దినాలలో నెరవేర్చబడబోతున్న ఐదు ప్రాముఖ్యమైన పాత్రలను గురించిన భవిశ్యవాణులు ఇవ్వబడ్డాయి. అవి క్రింద ఇవ్వబడిన పాత్రలు:
- ప్రవక్త (ద్వి.కాం.18:15-18 = అపో.కా.3:12-26)
- పాలకుడు (2 సమూయేలు 7:12-16; 1రాజులు.6:12; కీర్తన.89:19-37, 132:11-12; యెషయా.9:6, 55:4; యిర్మీయా.33:19-26; దానియేలు.7:13-14, 8:25; మీకా.5:2 = మత్తయి.2:1-2, 5; ప్రకటన.1:5)
- ప్రధానయాజకుడు (కీర్తన.110:4 = హెబ్రీ.5:5-6, 6:20, 7:11-25)
- అభిశిక్తుడు లేక క్రీస్తు (యెషయా.61:1; దానియేలు.9:25-26 = మత్తయి.16:16, 26:63-64; లూకా.2:11, 4:17-21,41; యోహాను.1:41, 4:25, 11:27)
- ఏలియా (మలాకి.4:5 = మత్తయి.11:7-15, 17:11-12; లూకా.1:13-17)