యూదుమతస్తులకు ప్రశ్నలు-4

 

క్రొత్తనిబంధన గ్రంథాన్ని ఎత్తివ్రాయడములో జరిగిన వైవిధ్యాలను తప్పుబట్టే జూడాయిజం వారికి ప్రశ్నలు

 

బైబిలుపై నిజక్రైస్తవుల గ్రహింపు మరియు విశ్వాసము:

1. పరమతండ్రి తానే ప్రవక్తలను, యజకులను, రాజులను, అపోస్తలులను ఎన్నుకొని వారిని తన ఆత్మచేత ప్రెరేపించి మానవకోటికి తన సందేశంగా 66 (39 హెబ్రీ లేఖనాలు + 27 గ్రీకు లేఖనాలు) గ్రంథాల సంపుటి అయిన బైబిలును అందించాడు.
2. ఈ 66 గ్రంథాలన్నీకూడా ప్రారంభములో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు వ్రాసారు. వారి వ్రాతలలో పొరపాట్లు లేవు.
3. కాలక్రమంగా ఆ లేఖన గ్రంథాలను పరిశుద్ధాత్మ ప్రేరణలేని విశ్వాసులు ఎత్తివ్రాయడము అలాగే అనువాదము చేయడము జరిగింది. ఈ ప్రక్రియ అనేకసార్లు జరిగింది. 
4. ఎత్తివ్రాయడములో మరియు అనువాదాలలో పొరపాట్లు జరిగాయి. ఈ రకమైన పొరపాట్లు అన్ని ప్రాచీన మత గ్రంథాలలో జరిగింది. అయినా, మానవకోటికి అందించిన పరమతండ్రి సందేశము ఎన్నటికి ఎవరిచేత నాశనము చేయబడదు. ప్రాచీన వ్రాతప్రతులన్నింటిని కూళంకశంగా పరిశీలించిచూస్తే సంపూర్ణ దైవసందేశమును గుర్తించడము సాధ్యమవుతుంది.
5. పై వాస్తవాల వెలుగులో బైబిలులోని 66 గ్రంథాలలో ఇప్పటి అనువాదాలలో పొరపాట్లు వున్నా బైబిలు (పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాలు) దైవగ్రంథమన్నది వాస్తవం. అనువాదాలలోని పొరపాట్లనుబట్టి బైబిలులోని  భాగాలను లేక మొత్తాన్ని దైవగ్రంథము కాదు అన్నవ్యక్తి అవిశ్వాసి మరియు అజ్ఙాని. ఈ సందర్భంగా ఎత్తివ్రాసిన లేక అనువాదం చేయబడిన పాతనిబంధన గ్రంథములో (తనాక్) లేక క్రొత్తనిబంధన గ్రంథములో దొర్లిన మానవ పొరపాట్లు/లోపాలుకూడా దేవుడిచ్చిన సందేశములోని భాగాలుగా స్వీకరిసంచకూడదు అన్నది గమనములో వుంచుకోవాలి.
6. దేవుడిచ్చిన 66 గ్రంథాలలోని అన్నింటినీ లేక కొన్నింటిని తిరస్కరించే మరియు ప్రశ్నించే స్వాతంత్రము/హక్కు అందరికి వుంది. అయితే వాటిని దూశించి తూలనాడే స్వాతంత్రము/హక్కు సంస్కారవంతులకెవరికీ లేదు శాపగ్రస్తులైన పశుస్వభావులకు తప్ప.  

మెసొరెటిక్ తనాక్ గ్రంథం (పాతనిబంధనగ్రంథము) లోని యూదులు వ్రాసుకున్న విశయాలు వాటితాలూకు సాక్షాధారాలు: 

ఒకే వర్షనులో కల్పితాలతోకూడిన వైవిధ్యాలు…!!! 

సాక్షాధారం # 1  

యెహోయాకీను యేలనరంభించినది 18 సంవత్సరాల వయస్సులోనా? లేక 8 సంవత్సరాల వయసులోనా? ఏసంఖ్య దేవుడిచ్చింది ఏసంఖ్య యుదులు వ్రాసుకున్నది?   

(i) 2రాజులు 24:8
(ii) 2దినవృత్తాం.36:9

సాక్షాధారం # 2

అహజ్యా యేలనారంభించినప్పుడు 22 యేండ్లవాడా? లేక నలభై రెండు యేండ్లవాడా? ఏసంఖ్య దేవుడిచ్చింది ఏసంఖ్య యూదులు వ్రాసుకున్నది? 

(i) 2రాజులు 8:26
(ii) 2దినవృత్తాం.22:2

సాక్షాధారం # 3

రాజైన సొలోమోనుకు వుండిన గుఱ్ఱపు శాలలు 40,000? లేక 4,000? ఏసంఖ్య దేవుడిచ్చింది ఏసంఖ్య యుదులు వ్రాసుకున్నది? 

(i) 1రాజులు 4:26
(ii) 2దినవృత్తాం.9:25

సాక్షాధారం # 4 

సొలోమోను కట్టించిన మందిరముకొరకు హీరాము పోతపోసిన సముద్రపు తొట్టి/పాత్రలో తొమ్మిది గరెసెల నీళ్ళు (2000 baths) పట్టుతుందా? లేక ముప్పై పూట్ల (3000 baths) నీళ్ళు పట్టుతాయా? ఏసంఖ్య దేవుడిచ్చింది ఏసంఖ్య యూదులు వ్రాసుకున్నది? 

(i) 1రాజులు 7:26
(ii) 2దినవృత్తాం.4:5 

సాక్షాధారం # 5

సోబారాజు హదదెజరును ఓడించి అతనియొద్దనుండి దావీదు పట్టుకొన్నది 1700 గుఱ్ఱపు రౌతులనా? లేక 7000 గుఱ్ఱపు  రౌతులనా? ఏసంఖ్య దేవుడిచ్చింది ఏసంఖ్య యూదులు వ్రాసుకున్నది? 

(i) 2సమూయేలు 8:4
(ii) 1దినవృత్తాం.8:4

సాక్షాధారం# 6

యూదా రాజైన ఆసా యేలుబడిలో వున్నప్పుడు ఇశ్రాయేలీయుల రాజైన బయెషా  24 యేండ్లు పాలించాడా? లేక 36 యేండ్లు పాలించాడా? ఏది దేవుడిచ్చిన సంఖ్య, ఏది యూదులు వ్రాసుకున్న సంఖ్య? 

(i)  1రాజులు 15:33
(ii) 2దినవృత్తాం.16:1)

సాక్షాధారం# 7

దావిదు భ్యార్య అయిన సౌలు కూతురు మికాలు మరణమువరకు గొడ్రాలా? గొడ్రాలు కాదా? ఏది దేవుడు చెప్పింది ఏది యూదులు వ్రాసుకున్నది? 

(i) 2సమూయేలు 6:23
(ii) 2సమూయేలు 21:8

సాక్షాధారం# 8

అబ్షాలోము రాజు (దావీదు) యొద్దకు వచ్చింది నాలుగు సంవత్సరాల తరువాతా లేక నలుభై సంవత్సరాల తరువాతా? ఏది దేవుడు చెప్పింది ఏది యూదులు వ్రాసుకున్నది?

(i)  2సమూయేలు 15:7
(ii) 2సమూయేలు 15:7 (footnote1)

సాక్షాధారం# 9

సోబారాజు హదదెజరా? లేక, హదరెజరా? ఏది దేవుడు చెప్పింది ఏది యూదులు వ్రాసుకున్నది?

(i) 2సమూయేలు 8:3
(ii) 1దినవృత్తాం.18:3

7. పై సాక్షాధారాలను బట్టి పాతనిబంధన గ్రంథము దైవగ్రంథము కాదనా? లేక పాతనిబంధన గ్రంథాన్ని యూదులు వ్రాసుకున్నారనుకోవాలా?* రెండూ తప్పు. అది లోపభూయిష్టమైన తర్కవాదుల అజ్ఙాన అవగాహన. పై సాక్షాధారాలను బట్టి యూదులు ఎత్తివ్రాసుకున్న కొన్ని వ్రాతప్రతులలో పొరపాట్లు/లోపాలు దొర్లాయి. అది సహజమే, అందులో బెంబేలెత్తిపోవలసినదేమీలేదు. అదేవిధంగా, క్రొత్తనిబంధనలో కూడా క్రైస్తవులు ఎత్తివ్రాసుకున్న వ్రాతప్రతులలో పొరపాట్లు/లోపాలు దొర్లాయి. ఇదీ సహజమే. ఈ వాస్తవాన్ని బట్టి క్రొత్తనిబంధన క్రైస్తవులు వ్రాసుకున్నారు అని భ్రమిస్తే అది లోపభూయిష్టమైన అజ్ఙాన అవగాహన. అలాంటి వాదన చేస్తూ అమాయకులను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్న జూడాయిజం వారు ద్వందనీతిపరులు మరియు వేశధారులు అన్నది లేఖనాల వెలుగులో స్పష్టమవుతున్నది.