ధర్మశాస్త్రపు నీతి Vs. దేవుని నీతి
మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)…
- మేలైనది
- నీతిగలది
- శ్రేష్టమైనది
- సత్యమైనది
- నమ్మదగినది
- పరిశుద్ధమైనది
- అర్థంకానిది కాదు
- దూరమైనది కాదు
- ప్రయోజనకరమైనది
- దేవుడు నియమించినది
- పూర్వ/పాత నిబంధనలోనిది
(ద్వి.కాం.30:11; నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11; 1తిమోతి.1:8-11; 2తిమోతి.3:16-17)
మోషేధర్మశాస్త్రముద్వారా నీతిమంతులుగా తీర్చబడవచ్చు. అందుకు శరతులు ఈ క్రింద యివ్వబడినవి
అ) ధర్మశాస్రములోని ఆజ్ఙలన్నింటిని పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1; రోమా.2:13; యాకోబు 2:10)
ఆ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను అన్నివేళలా పాటించాలి (ద్వి.కాం.5:29, 6:2)
ఇ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను తప్పిపోకుండా పాటించాలి (ద్వి.కాం.27:26; యిర్మీయా.11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)
ఈ) అప్పుడు, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలరు (ద్వి.కాం.6:25)
ఉ) ధర్మశాస్త్రాన్ని పాటించడములో తప్పిపోతే (కొంత తప్పినా) శాపగ్రస్తులవుతారు (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)
పై వాస్తవాలను బట్టి పాతనిబంధనగా గుర్తించబడిన తనాక్ గ్రంథమంతటిలో కేవలము మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా అనుసరించడముద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి ఒక్కరుకూడా లేరు అన్నది గమనార్హమైన విశయం.
పరమతండ్రి మోషేధర్మశాస్త్రములో పాపాము చేసినవారికి శాపవిమోచననొసిగే పాపక్షమాపణ మార్గాలను విశదీకరించాడు
i. సమాజ పాపాలకు బల్యర్పణలను (రక్తబలులు) నిర్ధేశించాడు.
(లేవీ.కాం.; సం.కాం.15:22-26)
ii. వ్యక్తిగత పాపాలకు:
– తెలిసి చేసిన కొన్ని పాపాలకు బల్యర్పణలు (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:6-8, 15:)
– యాదృచ్ఛిక పాపాలకు బల్యర్పణలు లేక గొధుమ పిండితో కూడిన నైవేద్యము/హోమద్రవ్యము (లేవీ.కాం.4:1-31, 5:1-13; సం.కాం.15:27-29)
– దైవదూషణతోకూడిన ధిక్కారంతో చేసిన పాపాలకు మరణశిక్ష (సం.కాం.15:30-31)
iii. మోషేధర్మశాస్త్రములోని పదిఆజ్ఙలను మీరిన వారికి శిక్షలు:
పదిఆజ్ఙలలోని ఆరు అజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష. (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10)
గమనిక: కేవలము యాదృచ్ఛిక పాపాల విశయములో మాత్రమే ఒకవేళ రక్తబలులర్పించే పరిస్థితి లేక స్థోమత లేని సందర్భాలలో గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశమివ్వబడింది. ఈ వెసలుబాటు అంటే గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశం అన్నది తెలిసి చేసిన పాపాల విశయములో ఇవ్వబడలేదు.
మోషేధర్మశాస్త్రము చేయలేనివి
– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులకు నీతిమీంతులయ్యే మార్గం చూపలేదు
– తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
– మరణకరమైన పాపాలకు క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి యివ్వలేదు
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అందించలేదు
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని యివ్వలేదు
– ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16)
సృష్టికర్త మోషేధర్మశాస్త్రనికి వేరుగా అది చేయలేని వాటిని చేశాడు
– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులను నీతిమంతులుగా చేశాడు [అబ్రహాము (ఆది.కాం.12:11-13; 15:6; 20:1-2, 5; రోమా.4:3; గలతీ.3:6)]
– తెలిసీతెలియక చేసిన అన్ని పాపాలకు (పరిశుద్ధాత్మ దూశణకు తప్ప) క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం అనుగ్రహించాడు (అపో.కా.13:39; కొలొస్సీ.2:13; 1యోహాను.1:9)
– మరణకరమైన పాపము చేసిన వ్యక్తులకు క్షమాపణను అందించాడు [దావీదు (2సమూయేలు.12:1-13)]
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి ఇచ్చాడు (ఎఫెసీ.2:11-22; 1పేతురు.2:9-10)
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అనుగ్రహించాడు (2పేతురు.1:1)
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని ఇచ్చాడు (గలతీ.3:28-29)
– పాపులైన అనేకమందిని యూదులు మరియు యూదేతరులు అన్న భేదం లేకుండా నీతిమంతులుగా మార్చాడు (రోమా.3:23-30)
లేఖనాల ప్రకారం పరమతండ్రి…
- నోవహునిబంధనను మానవులందరితో చేసాడు (ఆది.కాం.9:9-10)
- అబ్రహామునిబంధనను అబ్రహాము సంతతితో చేసాడు [మానవులందరితో కాదు] (ఆది.కాం.17:7-8)
- దావీదునిబంధనను దావీదు సంతతితో చేసాడు [ఇశ్రాయేలీయులందరితో కాదు] (2సమూయేలు.23:5; యిర్మీయా.33:20-22)
అయితే, మోషేనిబధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేసాడా…?
లేఖనాల సాక్ష్యం ప్రకారము ప్రభువైన దేవుడు మోషేనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేసినా అది కేవలం వారితో మాత్రమే కాకుండా వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడాలేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతో కూడా (ద్వి.కాం.29:29) చేశాడు. కాని, మానవులందరితో లేక అన్యులందరితో కాదు (ద్వి.కాం.29:11-15).
లేఖనాలు ప్రకటిస్తున్నదాని ప్రకారం…
- నోవహునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం. 9:16)
- అబ్రహామునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం.17:7,19; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)
- దావీదునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/berith olam] (2సమూయేలు.23:5).
కాని, మోషేనిబంధనను నిత్యనిబంధనగా లేఖనాలు పేర్కొనడం లేదు!
గమనార్హమైన విశయం
మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి తనాక్ లో ఎక్కడా పేర్కొనలేదు. తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని నిత్యనిబంధనలకు మరియు మోషేనిబంధనకు గల ఈ వ్యత్యాసం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని నిత్య సంకల్పములో రూపకల్పన చేయబడిన క్రొత్తనిబంధన మోషేనిబంధన స్థానములో ఆవిష్కరించబడి నిత్యనిబంధనగా కొనసాగబోతున్నందున (యిర్మీయా.31:31-34, 32:37-40) తనాక్ లో ఎక్కడకూడా మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి పేర్కొనలేదు. ఇది ఆయన ఆనాదికాల ప్రణాళిక. ఆయన బుద్ధి జ్ఙానముల బాహుళ్యము ఎంతో గొప్పది అనడానికి ఇదో మచ్చుతునక!
మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా అన్నికాలాలలో తప్పిపోకుండా నెరవేర్చి తద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు పాతనిబంధన గ్రంథమంతటిలో (తనాక్) ఒక్కరు కూడా లేరు. మరోమాటలో చెప్పలంటే మోషేధర్మశాస్త్రము ఒక్కరినికూడా నీతిమంతునిగా తీర్చలేకపోయింది. (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11)
[గమనిక: పాతనిబంధన గ్రంథములో (తనాక్) లో నీతిమంతులున్నారు. అయితే వారు విశ్వాసమునుబట్టి నీతిమంతులని పేర్కొనబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం! (ఆది.కాం.15:6; హబక్కూకు.2:2; గలతీ.3:12)]
మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1).
అయితే, ఇశ్రాయేలీయులు తామే పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆనిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1).
ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను అంటూ చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59).
ఈ నేపథ్యములో దేవుడు ఇశ్రాయేలీయులచేత భంగం చేయబడిన మోషేనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక సరిక్రొత్తనిబంధనను చేయబోతున్నట్లుకూడా వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).
అయితే, ఆ క్రొత్తనిబంధన పూర్వముండిన మోషేనిబంధనవంటిది కాదు అన్న పరమతండ్రి ప్రకటన ఇక్కడ అతిప్రాముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి.
“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు…” (యిర్మీయా.31:31-32)
పరమతండ్రి పూర్వ లేక పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). కాని, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్షాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).
క్రొత్తనిబంధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాడా…?
లేఖనాల సాక్ష్యం ప్రకారము…
– ప్రభువైన దేవుడు క్రొత్తనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేయబోతున్నా అది కేవలం వారితో మాత్రమే చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు.
– ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు/మానవకోటికి (కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలం అన్యజనులు అని కాదు) అంటే మానవులందరికి నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు (యెషయా.42:1-7, 49:5-8; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28). నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ!
– అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!
– అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14 = అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!
– ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ నిబంధన (క్రొత్తనిబంధన) ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్ష్యాన్ని అందించాడు.
– పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని మహోత్తర ప్రణాళిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడు గనుక ఇశ్రాయేలీయులకు ‘అన్యజనుల వలన రోషము పుట్టించబోతున్నాను’ అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు మరియు విషం అంతా!
– “నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే అన్యజనులు సహితం ప్రవేశించేందుకు వీలుగా దేవుని రాజ్య ద్వారాలను తెరచిన క్రొత్తనిబంధన!
మోషేధర్మశాస్త్రము చేయలేకపోయినదాన్ని దేవుడు చేసాడు:
“కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని (యషువ మషియాఖ్/యేసు క్రీస్తు) పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:1-4)
“ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.[ఆది.కాం.15:6; యెషయా.46:13, 53:8-11; హబక్కూకు.2:4; దానియేలు.9:24] అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.” (రోమా.3:20-22)
“మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2కొరింథీ.3:14-16)
వేబ్ సైట్ లేదు
బ్రదర్, వెబ్ సైట్ మీ ఫొనులో ఓపన్ కాకపోతే వేరే ఫోనులో ప్రయత్నించి చూడండి. కంప్యూటరులొనైతే తప్పకుండా ఓపన్ అవుతుంది.
సూపర్ చాల చక్కగా ఉంది