Category Archives: ఇతరాలు

Permalink to single post

అబద్ధ బోధకులను గుర్తించటమెలా?

దుర్బో

దుర్బోధలు అన్నవి అబద్ధ బోధకులు చేస్తున్న తప్పుడు బోధలు. ఇవి దేవుని పొలానికి పట్టిన అతి ప్రమాదకరమైన చీడపురుగులు. వీటి బారినపడి అనేకమంది క్రైస్తవులు ఆత్మీయంగా నిర్వీర్యమౌతూ నిత్యనాశనానికి చేరువౌతున్నారు.

దుర్బోధ అంటే లేఖనాలు బోధించనివాటిని బోధిస్తున్నట్లుగా లేక బోధిస్తున్న వాటిని బోధించనట్లుగా బోధించటము. అంతేగాక, అనువాదాలపైనే పూర్తిగా ఆధారపడి మూలభాషలోని పదాల అసలు భావాన్ని, సందర్భాన్ని, కాలాన్ని మరియు సాహిత్య సాధనాలను/పద్ధతులను [Literary devices/techniques] పరిగణాలోకి తీసుకోకుండా చేసే బోధ!

ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తముతో సంపాదించిన నిజవిశ్వాసుల యొక్క సహవాసమైన సంఘము పుట్టినప్పటినుండే అబద్ధ బోధకులు లేక దుర్బోధకులు మరియు వారి దుష్ట ప్రయత్నాలు అన్నవి మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గనుక, తస్మాత్ జాగ్రత్త!

ఈ విశయములో లేఖనాలు పదేపదే చేస్తున్న హెచ్చరికను గుర్తుంచుకొని జాగ్రత్త పడటం అన్నది ప్రతివిశ్వాసి యొక్క గురుతర బాధ్యత:

దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపో.కా.20:28-30)

మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.” (2పేతురు.2:2-3)

జనులు హితబోధను సహింపక, దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2తిమోతి.4:3-4)

క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” (2యోహాను.9-11)

దుర్బోధకులకుండే సర్వసాధారణ లక్షణాలు:

  1. తమకు అన్నీ తెలుసు అని భ్రమిస్తుంటారు, భ్రమపెడుతుంటారు.
  2. పరిశుద్ధ లేఖనాలకు తాము యిచ్చే వివరణే నూటికి నూరు శాతం సరియైన వ్యాఖ్యానం అంటూ నమ్మబలుకుతుంటారు.
  3. తమతో విభేదించేవారిని తీవ్రమైన పదజాలముతో విమర్శిస్తుంటారు.
  4. ఇతరులను మరియు యితరుల విశ్వాసాలను కించపరచటం హేళనచేయటం వీరికి వెన్నతో పెట్టిన విధ్య.
  5. ఇతరులకు అలాగే యిరతుల విశ్వాసాలకు తీర్పుతీర్చే విశయములో వీరు తెచ్చిపెట్టుకున్న అధికారాన్ని మేకపోతు గాంభీర్యముతో ప్రదర్శిస్తుంటారు.
  6. అందరికి అంటే లోకములో ఉన్నవారందరికి, క్రైస్తవులందరికి, లేక పాస్టరులందరికి ఒక్క మాటలో తీర్పుతీర్చటమన్నది తరచు వీరిలో కనిపించే నికృష్టమైన ఆత్మీయ వ్యాధి.
  7. అపోస్తలుల బోధకన్న వారి మాదిరికన్న తాము చెప్పేదే వేదవాక్యమన్నట్లు వాక్య వ్యతిరేకమైన సంచలన వ్యాఖ్యానాలు చేస్తూ తమ చుట్టూ భజనకారులను ప్రొగు చేసుకునే ప్రయత్నములో ఉంటారు.
  8. లేఖనాలు [బైబిలు] చెప్పేదానికి పూర్తిగా వ్యతిరేకంగా బోధించటం వీరి ప్రత్యేక లక్షణం.
    ఉదాహరణలు:
    అ) బైబిలు–“అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై…” (ఆది.కాం.17:1)
    అబద్ద బోధకులు–“యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై అంటే, @-#$%=్*!~. కనుక, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షము కాలేదు.”

    ఆ) బైబిలు–“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.” (యోహాను.1:1)
    అబద్ద బోధకులు–“వాక్యము దేవుడై యుండెను అంటే, ~!@#$%్*(). కనుక, వాక్యము దేవుడై యుండలేదు.”

    ఇ) బైబిలు–“పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.” (మత్తయి.28:16-17)
    అబద్ద బోధకులు–“శిష్యులు యేసుకు మ్రొక్కిరి అంటే, #$@!%్)*్(. కనుక, శిష్యులు యేసుకు మ్రొక్కలేదు.”

    ఈ) బైబిలు–“అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.” (యోహాను.20:28)
    అబద్ద బోధకులు–“తోమా యేసుతో నా దేవా అనెను అంటే, ్%*$(#)@!-. కనుక, యేసు దేవుడు కాదు తోమా ఆయనను నా దేవా అని సంబోధించలేదు. ఒకవేళ తోమా ఆయనను ‘నా దేవా’ అని సంబోధించినా యేసు దేవుడు కాదు. తోమాకు దేవుడెవరో తెలియదు లేక తోమా అబద్ధం చెప్పాడు. తోమాకన్న నాకు ఎక్కువ తెలుసు, యేసు దేవుడు కాదు.”

    ఉ) బైబిలు–“గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.” (అపో.కా.1:11)
    అబద్ద బోధకులు–“ఆ రీతిగానే యేసు తిరిగి వచ్చును అంటే, ~$%్<)>?(*#@!. కనుక, యేసు ఆరీతిగానే తిరిగి రాడు.”

    ఊ) బైబిలు–“ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన.20:6)
    అబద్ద బోధకులు–“మొదటి పునరుత్థనములో పాలుపొందేవారు క్రీస్తుతోకూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే, *?\్?%)$>#@<!(. కనుక, వెయ్యి సంవత్సరముల రాజ్యములేదు వారు క్రీస్తుతోకూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయటమూ లేదు.”

క్రింది ప్రశ్నలకు వారి నుండి జవాబులను రాబట్టగలిగితే వారి గుట్టు బట్టబయలు అవుతుంది:

1. బైబిలులోని 66 గ్రంథాలన్నీ దైవగ్రంథాలని నమ్ముతారా? [పాతనిబంధన గ్రంథము 39 + క్రొత్తనిబంధన గ్రంథము 27]  

2. దేవుడు అద్వితీయుడు. అయితే, ఆయనది లెక్కలలో, ముక్కలలో, లేక మూసలలో ఇమిడే అస్తిత్వం కాదు. కనుక, నిజదేవున్ని మానవ మేధస్సుతో సంపూర్ణముగా అర్థం చేసుకోలేము అని గ్రహించారా? [ద్వి.కాం.6:4; రాజులు.8:27; కీర్తన.139:1-12; మార్కు.12:29; 2కొరింథి.1:14]     

3. నజరేయుడైన యేసు [యషువ] ప్రవచించబడిన రాబోవు క్రీస్తు [మెస్సయ్య] అన్న సత్యాన్ని ఒప్పుకుంటారా? [యోహాను.4:25-26; అపో.కా.2:36; 1యోహాను.2:22]  

4. యేసు క్రీస్తు [యషువ మెస్సయ] మీ పాపాల కొరకు శ్రమలను అనుభవించి శిలువపై మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తారా? [లూకా.24:46-48; 1యోహాను.4:10]  

5. యేసుక్రీస్తు [యషువ మెస్సయ] మీ ప్రభువని అంగీకరిస్తారా? [అపో.కా.10:36; యోహాను.13:13; రోమా.10:9-13]  

6. అపోస్తలుల బోధ మరియు మాదిరినిబట్టి, ప్రభువైన యేసు క్రీస్తు[యషువ మెస్సయ]ను “నా ప్రభువా” మరియు “నా దేవా” అని సంబోధించగలరా? [మత్తయి.22:42-45; యోహాను.1:1,14; 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-8; తీతుకు.2:13; హెబ్రీ.1:8]   

7. తండ్రికి ఏవిధంగా προσκυνέω/ప్రొస్కునెహొ [ఆరాధన; పూజ్యభావముతో మ్రొక్కటము] ఆపాదిస్తూ ఘనపరుస్తారో అదేవిధంగా కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు[యషువ మెస్సయ]కు కూడా προσκυνέω/ప్రొస్కునెహొను అపాదిస్తూ ఘనపరచగలరా? [మత్తయి.28:9, 17; యోహాను.4:24; 5:23; ప్రకటన.5:11-14]    

పై ప్రశ్నలలో ఏ ఒక్క దానికైనా ‘లేదు’ అన్న సమాధానమిచ్చినా ఆ బోధకుడు అబద్ధ బోధకుడు లేక దుర్బోధకుడు అన్నది గ్రహించాలి.

కొందరు పై ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకుండా దాటివేసే ప్రయత్నము చేస్తుంటారు లేదా అసలు జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నము కూడా చేయవచ్చు. అలాంటివారు అబద్ధ బోధకులు అన్నది వెంటనే గ్రహించవచ్చు.

ఈ సందర్భంగా, ఏ అబద్ధ బోధకుడు కూడా నేను అబద్ధ బోధకున్ని అని ఒప్పుకోడు లేక ఆ వాస్తవాన్ని ప్రకటిస్తూ తిరుగడు అన్నది విశ్వాసులు గమనములో ఉంచుకోవాలి!

అయినా, అబద్ధ బోధకుల బోధలు మరియు వారి జీవిత విధానం చాలావరకు ఈ సత్యాన్ని బహిర్గతం చేస్తుండటాన్ని చూడవచ్చు. అయితే, కొన్ని సార్లు దుర్బోధకులు తమ అసలు రంగు కనబడకుండా ఉండేందుకై గొర్రె చర్మాన్ని ధరించి వచ్చే అవకాశముంది.

అంటే, పై ప్రశ్నలన్నింటికి “అవును” అంటూ యదార్థ రహిత సమాధానాలను చెప్పి రహస్యముగా వాక్య విరుద్ధ బోధలను కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. వీరి కుయుక్తులకు నటనలకు అమాయక నామకార్థ క్రైస్తవులు, స్థిరమైన ఆత్మీయ పునాది లేనివారు, అలాగే వాక్యజ్ఙానం కరువైన వారు మోసపోయి వారి దుర్బోధలకు బలి అవుతుంటారు.

దుర్బోధకులు అనుసరించే కుయుక్తుల విశయములో విశ్వాసులు అమిత జాగ్రత్త కలిగినవారై తమ విశ్వాస జీవితాన్ని లేఖనాల వెలుగులో దేవునికి ఇష్టమైన విధానములో కొనసాగించటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి…తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” (యూదా.20-25)

 

Permalink to single post

కన్యక లేక యవ్వన స్త్రీ?

కాబట్టి ప్రభువు తానే యొక సూచన [אוֹת/oth/ఓథ్] మీకు చూపును. ఆలకించుడి, కన్యక [עַלְמָה/అల్మ] గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము ].” (యెషయా 7:14)

పై ప్రవచనాత్మక లేఖన సందేశములో గుర్తించాల్సిన సత్యాలు:

(1) ఆదిమ హెబ్రీ భాషలో ‘అల్మ’ [עַלְמָה/alma] అనే పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము లేని యువతి. ఈ పదం 7 సార్లు తనాక్ లో వుపయోగించబడింది.

ఉదాహరణ: “అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ ‘చిన్నది’ [עַלְמָה/అల్మ] వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.” (ని.కాం.2:8).

ఇక్కడ మోషే అక్క పెళ్ళి అయిన స్త్రీ కాదు అందుకే పై లేఖనములో ఆల్మ [עַלְמָה/alma] అనే పదము ఆమెకు ఉపయోగించబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.

తనాక్ అంతటిలో అల్మ [עַלְמָה/alma] అనే హెబ్రీ పదం వివాహము జరిగిన యువతిని సూచించటానికి ఒక్కసారి కూడా ఉపయోగించబడలేదు అన్న వాస్తవము ఈ సందర్భములో గమనార్హమైన విశయము.

(2) క్రీస్తుకు పూర్వమే 3వ శతాబ్ధములో హెబ్రీ భాషలోని తనాక్ లేఖనాలను గ్రీకు భాషలోకి అనువదించారు. అనువదించినవారు ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో ప్రావీణ్యత సంపాదించిన యూదు పండితులు. వారు తమ లేఖనాలలోని మరియు దినాలలోని పదాల భావాలను పదాలమధ్య బేధాలను బాగా యెరిగినవారు. వారు అనువదించిన తనాక్ యొక్క గ్రీకు లేఖనాలను సెప్టూజింట్ [Septuagint] అని పేర్కొంటారు. సెప్టూజింటులో యెషయా 7:14లోని పదాన్ని గ్రీకులో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అనే పదంగా అనువదించారు. ఇదే పదం క్రొత్తనిబంధనలోని మత్తయి వ్రాసిన సువార్తలో వుపయోగించబడింది:

ఇదిగో కన్యక [παρθένος/parthenos] గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” (మత్తయి 1:23).

గ్రీకు భాషలో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అన్న పదానికున్న అర్థాలు: యువతి; యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము ఎరుగని యువతి; స్త్రీ సాంగత్యము ఎరుగని పురుషుడు.

(3) ఆదిమ హెబ్రీ భాషలో ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అనే పదముకూడా యవ్వన స్త్రీలకు వాడబడింది. ఈ పదం 50 సార్లు తనాక్ లో వుపయోగించబడింది. ఈ పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక.

తనాక్ (పాతనిబంధన) లో వుపయోగించబడిన హెబ్రీ భాషాపదం బెతూల [בְּתוּלָה/betulah] లో కన్యత్వము స్పష్టముగా ప్రతిబింబించడములేనందుననే ఈ పదాన్ని వుపయోగించిన కొన్ని సందర్భాలలో కన్యత్వాన్ని సూచించడానికి కన్యత్వ వివరణ యివ్వబడింది: ఉదాహరణలు:


ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె బెతూల (בְּתוּלָה/bethulah), ఏ పురుషుడును ఆమెను కూడలేదు;” (ఆది.కాం.24:16)

తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత బెతూల (בְּתוּלָה/bethulah), అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును.” (లేవీ.కాం.21:3)

(4) అల్మ [עַלְמָה/alma] అన్న హెబ్రీ పదము 7 సార్లు తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో వుపయోగించబడినా ఒక్కసారికూడా వివాహమైన యవ్వన యువతికి ఆపాదించబడలేదు. అయితే, ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అన్న హెబ్రీ పదము మాత్రము తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో ఒకసారి వివాహమైన యవ్వన యువతికికూడా ఆపాదించబడింది. “పెనిమిటి పోయిన బెతూల [בְּתוּלָה/bethulah] గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.” (యోవేలు 1:8). దీన్నిబట్టి బెతూల కన్న అల్మ అన్న హెబ్రీ పదమే కన్యకకు సరియైన పదమని గ్రహించవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తలద్వారా ‘కన్యక’ అన్న భావాన్ని సూచించడానికి ఆదిమ హెబ్రీభాషలోని ‘అల్మ’ [עַלְמָהalma] మరియు గ్రీకు భాషలోని ‘పార్తెనోస్’ παρθένος/parthenos] అన్న పదాలను వుపయోగించడము జరిగింది. విజ్ఙలు ఈ సత్యాన్ని గ్రహించగలరు!

(5) హిజ్కియా తల్లి అయినా, హిజ్కియా భార్య అయినా, లేక యెషయా భార్య అయినా కన్యక (עַלְמָה/అల్మ; παρθένος/పార్తెనోస్) కాదు. కనుక, యెషయా 7:14 హిజ్కియా విశయములోగాని, హిజ్కియా కుమారుని విశయములోగాని లేక యెషయా కుమారుని విశయములోగాని వర్తించదు, నెరవేర్చబడలేదు!

(6) యెషయా 7:14 లో యివ్వబడిన ప్రవచనములోని ప్రధానమైన భాగము “ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.” ఇక్కడ ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) అన్నది సర్వసాధారణ సంభవాన్ని గూర్చినది కాదు. అది ఒక ‘ప్రత్యేకమైన గుర్తు’ లేక అసాధారణ సంఘటన.

ప్రభువైన దేవుడు తానే యివ్వబోతున్న ఆ గొప్ప సూచన ఎలాంటి సూచనతో సరితూగుతుందో అంతకుముందే 11వ వచనములో సూచించాడు, “అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే” (యెషయా.7:11). అలాంటి గొప్ప సూచన ఏదీ రాజైన ఆహాజుకు తోచకపోయి వుండవచ్చు.

అలాంటి సందర్భములో ప్రభువైన దేవుడే ఒక సూచనను ఒక ప్రత్యేకమైన గుర్తును అంటే ఒక అసాధారణ సంభవాన్ని గుర్తుగా అందించటము జరిగింది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరుగని విశయము. చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగని సంఘటన. నిజంగానే అది పాతాళమంత లోతైనది ఊర్థ్వలోకమంత ఎత్తయినది–ఒక కన్య [పురుష సంయోగము ఎరుగని యువతి] గర్భవతియై కుమారుని కనటం.

దేవుడైన ప్రభువు తానే చూపించబోయే ‘సూచన’ [א֑וֹת/oth/ఓథ్=ప్రత్యేకమైన గుర్తు] మానవాతీత శక్తికి సంబంధించినదనటానికి ఈ సందర్భములో మోషేకాలములో దేవుడే చేసిన రెండు ‘సూచనలను’ [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] జ్ఙాపకము చేసుకోవాలి:

మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచనను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.” (ని.కాం.4:6-9).

పై లేఖనాల వెలుగులో పాతాళమంత లోతుగా ఊర్థ్వలోకమంత ఎత్తుగా వుండే ప్రభువైన దేవుడు తానే చూపే ఆ ‘సూచన’ ఏమిటి…?

“ఒక వివాహమైన యవ్వన యువతి గర్భము ధరించి కుమారుని కనును” అన్నది అనవసరమైన పదప్రయోగముతో కూడిన ప్రకటన అన్నది అటుంచి, అసలు అలాంటిది ప్రకృతిలో సంభవించే అత్యంత సాధారణమైన సంఘటన అన్నది ఇంగిత జ్ఙానమున్న ఎవరైన యిట్టే చెప్పగలరు. అందులో సూచన అంటూ యేమీలేదు! అలాంటి అత్యంతసాధారణ సంఘటనను దేవుడొక ‘సూచనగా’ [ప్రత్యేకమైన గుర్తుగా] పేర్కొన్నాడంటూ వ్యాఖానించడమే అవివేకము, హాస్యాస్పదము!

అయితే, “కన్యక [పురుష సంయోగము ఎరుగని యవ్వన స్త్రీ] గర్భముధరించి కుమారుని కనును” అన్నది అసాధారణమైన విశయము. అలాంటి సంఘటన ప్రకృతిలో జరిగే అవకాశం లేదు. ఒకవేల అలాంటిదేదైనా జరిగితే దాన్ని ఒక మహాద్భుత ఘటనగా గుర్తించాల్సిందే. అలాంటిది సార్వభౌముడైన దేవుడు మాత్రమే జరిగించగలడు. అది ‘సూచన’గా చెప్పబడుటకు అర్హతకలిగిన సంఘటన. అందుకే ప్రవక్తద్వారా దేవుడే ఆ సంఘటనను యెషయా. 7:14 లో ఒక సూచనగా పేర్కొన్నాడన్నది గ్రహించాలి.

(7) ప్రవక్త అయిన యెషయాద్వారా యివ్వబడిన భవిశ్యవాణిలోని దైవసత్యాన్ని తిరస్కరించిన శాస్త్రులు, పరిశయ్యులు, మరియు రబ్బీలు అలాగే ఈనాటి రబ్బీలమతములోని వారు ఆత్మీయ అంధకారములోనే కొనసాగుతూ 2000 సంవత్సరాల క్రితం బేత్లెహేములో మరియ అనబడే ‘కన్యక’ జీవితములో జరిగిన ప్రవచనాత్మకమైన ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) యొక్క నెరవేర్పును స్వీకరించకపోగా దాని నేరవేర్పును కాలరాచే దుష్టప్రయత్నముతో తాము నాశనమార్గములో పయనిస్తూ అమాయకులను కూడా దారితప్పిస్తున్నారు! అలాంటివారిని ఉద్దేశించే మెస్సయ్య యిలా వాపోయాడు:

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.” (మత్తయి 23:15)

యూదు వివాహ సాంప్రదాయము

యూదుల సాంప్రదాయము ప్రకారము యూదు వివాహము రెండు దశలుగా జరుగుతుంది. మొదటి దశను ‘కిద్దుషిన్’ అని రెండవ దశను ‘నిసుఇన్’ అని పేర్కొంటారు. ప్రాచీనకాలములో ఈ రెండు దశలుకూడా దాదాపు ఒక సంవత్సరపు యెడముతో వేరువేరు సందర్భాలలో రెండు ప్రత్యేకమైన వేడుకలుగా జరుపుకునేవారు. అయితే, ఈ సాంప్రదాయము క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దమువరకు కొనసాగి అటుతరువాత రబ్బీల చొరవతో మారిపోయింది. ఈ మార్పునుబట్టే ఈనాడు యూదుల వివాహములోని రెండు దశలను వెనువెంటనే పూర్తిచేసి ఒకే వేడుకగా  జరుపుకుంటున్నారు.    

కిద్దుషిన్ అంటే ప్రధానము చేయబడుట [betrothal]. ఈ దశను పూర్తిచేయటములో సాంప్రదాయ ప్రకారము యూదులు ఎన్నుకునేందుకు వీలుగా రెండు రకాల  విధానాలు అందుబాటులో వుండేవి. అవి, (అ) కన్యాశుల్కము: పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు బహుమానముగా ధనాన్ని యివ్వటము; (ఆ) పత్రము: పెళ్ళికొడుకు తాను పెళ్ళికూతురును వివాహము చేసుకోబోతున్నట్లు వ్రాతపూర్వకంగా మాట యిస్తూ వ్రాసిన పత్రాన్ని పెళ్ళికూతురుకు అందించటము.

కిద్దుషిన్ [ప్రధానము] దశ పూర్తి అయిన తరువాత ఆ యిరువురు స్త్రీ పురుషులు సంపూర్ణ భార్యాభర్తలుగా యూదు సమాజము ఎదుట లెక్కించబడుతారు. అయినను వారి వివాహములోని రెండవదశ అయిన నిసుఇన్ [పెండ్లి] పూర్తి అయ్యేవరకు వారిరువురి మధ్య శారీరక సంబంధము వుండకూడదు.    

మరియ యోసేపుల వివాహము

యూదులకు రాజు మరియు ప్రపంచానికి ప్రభువు అయిన యషువ హ మషియాఖ్ [యేసు క్రీస్తు] ను మొదటి శతాబ్ధములో గర్భాన మోసి కన్న మరియ మరియు యోసేపుల వివాహమును గురించిన కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు క్రొత్తనిబంధనా గ్రంథములో వివరించబడ్డాయి (మత్తయి.1:18-25; లూకా.1:26-38, 2:1-20).

మరియ యోసేపుల మధ్య ప్రధానము [కిద్దూషిన్] జరిగింది. ప్రధానము చేయబడటానికి మరియు పెళ్ళితంతు [నిసుఇన్] జరగటానికి మధ్య కొంత కాలము గడిచింది. ఆ మధ్యకాలములోనే మరియ దైవశక్తి చేత గర్భవతిగా మారింది. ఆ సమయానికి పైన వివరించిన ప్రాచీన యూదు వివాహ సాంప్రదాయము ప్రకారము మరియ కన్యకే [పురుష సమ్యోగము లేని యువతి] అయినా అప్పటికే కిద్దూషిన్ [ప్రధానము] జరిగివుండటాన్నిబట్టి ఆమె యూదు సమాజములో స్త్రీగా [గ్రీకు: γυναικός/గునాయ్‌కొస్=భార్య] లెక్కించబడింది.

పై కారణాన్ని బట్టి క్రొత్తనిబంధన గ్రంథములో మత్తయిద్వారా యివ్వబడిన లేఖనాలలో మరియ కన్యకగా (మత్తయి.1:18) పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో స్త్రీగా (గలతీ.4:4) పేర్కొనబడటము గమనించగలము.

యూదు వివాహ సాంప్రదాయాలలోని లోతుపాతులను గూర్చిన అవగాహనలేని అవిశ్వాసులు కొందరు మత్తయి మరియు పౌలులద్వారా యివ్వబడిన లేఖనాలలోని ఈ తేడాను పేర్కొంటూ యిద్దరిలో ఎవరో ఒకరు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు అంటూ విశ్వాసులను కలవరపరచే ప్రయత్నంగా ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. అయితే, ఈలాంటి దుష్ట ప్రయత్నాల ఫలితం అవిశ్వాసులు తమ అజ్ఙానాన్నే బయటవేసుకోవటము!

అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన లేఖనాలను కొందరు వక్రీకరిస్తున్న విశయాన్ని గూర్చి అపోస్తలుడైన పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు హెచ్చరించటాన్ని ఈ సందర్భముగా జ్ఙాపకము చేసుకోవాలి:

“…మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.” (2పేతురు.3:15-17)

అవిశ్వాసుల అభ్యంతరాలు

అభ్యంతరము #1

“మూలభాషలో ‘ఆ అమ్మాయి’ (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి]) అని వుంది.”

వివరణ:

అవును యెషయా 7:14 లో వున్న పదజాలము ప్రకారము ప్రభువైన దేవుని సూచనగా ఉన్నది గర్భవతిగా వుండి కుమారుని కనబోతున్న ‘ఆ అమ్మాయి’ అని పేర్కొనబడి వుంది. కారణం…? గర్భవతియై కుమారుని కనబోతున్నది ఏదో ఒక కన్యక కాదు. అది ప్రభువైన దేవుడే తన ప్రణాలికలో ఉద్దేశించి దృష్టించిన కన్యక. అందునుబట్టి సూచనగా వుండబోతున్నది దేవుని దృష్టిలోవున్న ఒక ప్రత్యేకమైన కన్యక అని సూచించటానికి ‘ఆ అమ్మాయి’ అని మూలభాషలో పేర్కొనబడింది.

అభ్యంతరము #2

“మూలభాషలో “ఆ అమ్మాయి గర్భవతి అయింది” (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి] is with child) అని వుంది.”

వివరణ:

దైవ లేఖనాలలోని ప్రవచనాలు భవిశ్యద్ కాలానికి చెందినా వాటిని గూర్చిన సమాచారము లేక వివరాలను లేఖనాలు వ్యాకరణపరంగా భూత, భవిశ్యద్, వర్తమాన కాలాలలోని యేకాలములోనైనా వ్యక్తపరచటం పరిపాటి. కనుక, యెషయా 7:14 లో వున్న ప్రవచన ప్రకటన “అ అమ్మాయి గర్భవతి అయింది” అంటూ భూతకాలములో వ్యక్తపరచటమన్నది అసాధారణమైన విశయమేమీ కాదు.

అభ్యంతరము #3

“ఒకవేల ఈ వాక్యములో “ఒక/ఆ కన్యక గర్భవతి అవుతుంది” అని వుంటే ఒక యూదుడైన యోసేపు తాను వివాహమాడిన అమ్మాయి లేక కన్యక గర్భవతిగా వుందన్నది గ్రహించినప్పుడు యెషయా 7:14 లోని ప్రవచనము తన కళ్ళముందే నెరవేరుతున్నదంటూ ఆనందముతో ఎగిరి గంతులు వేసేవాడు కదా?”

వివరణ:

మరియ భర్త యోసేపు మతపరమైన పండితుడు కాదు లేక ఒక ప్రవక్త అంతకన్న కాదు. అతను ఒక సామాన్యమైన వడ్రంగి. తాను వివాహమాడిన యువతి గర్భము ధరించింది అన్న విశయము తెలిసినప్పుడు అందరిలా అతనికి కూడా సర్వసాధారణమైన కారణము అక్రమసంబంధమే తటస్థించి వుంటుంది గాని యెషయాలోని ఒక ప్రవచనము తాను ప్రధానము చేసుకున్న యువతిలో నెరవేర్చబడబోతున్నదని ఊహించుకొని తద్వారా ఎగిరి గంతులువేసేందుకు తగిన కారణాలు లేవు. నిజానికి దేవదూతే తన కలలో ప్రత్యక్షమై మరియ గర్భానికి గల హేతువును వివరించి చెప్పినప్పుడుకూడా యోసేపు ఎగిరి గంతులు వేయలేదు అన్నది ఈ సందర్భములో జ్ఙాపకము చేసుకోవాలి.

అభ్యంతరము #4

“యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:15 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేసరికి పెరుగు తేనె తిన్నట్లు ఎక్కడ వ్రాయబడివుంది?”

వివరణ:

బైబిలులోని ప్రవచనాల నెరవేర్పుకు ఆధారాలు కొన్ని సార్లు బైబిలులో మరికొన్ని సార్లు చరిత్రలో లభించటం కద్దు. అయితే, ప్రవచనాల నెరవేర్పు వివరాలన్నవి పూసగుచ్చినట్లు ప్రతీది బైబిలులోనో లేక చరిత్ర గ్రంథాలలోనో తప్పకుండా వుంటుందని లేక వుండాలని నిర్ధారించే నియమమేదీ లేదు. ఒక ప్రవచనము యొక్క ప్రధానాంశపు నెరవేర్పు తప్ప ద్వితీయశ్రేణి వివరాలు చాలమట్టుకు కాలగర్భములో కనుమరుగవుతాయి.

యెషయా.7:15 లో వ్రాయబడివున్నట్లు “కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును” అన్నవి ప్రవచనములోని ద్వితీయశ్రేణి వివరాలు. వీటి నెరవేర్పు తప్పకుండా వ్రాయబడి వుండాలి అన్న నియమమేదీ లేదు. కనుక, ఈ వివరాలు యషువ [యేసు] లో నెరవేర్చబడినప్పటికి అవి వ్రాయబడలేదు. ఒక వేల ఈ ద్వితీయశ్రేణి వివరాల నెరవేర్పు యషువలో నెరవేర్చబడినట్లు వ్రాయబడలేదు కనుక అది యషువను గురించి కాదు అని అభిప్రాయపడేవారు మరి ఆ వివరాల నెరవేర్పు వారు కోరుతున్న విధానములో ఏవ్యక్తిలో నెరవేర్చబడిందని వ్రాయబడిందో లేఖనాల ఆధారంగా చూపించ బద్దులై వున్నారు.

అభ్యంతరము #5

యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:16 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే యిద్దరు రాజుల దేశము పాడుచేయబడింది అని ఎక్కడ వ్రాయబడి వుంది?

వివరణ:

యెషయా.7:13-16 వరకుగల వచనాలలోని ప్రవచనాంశాలు:

  • ప్రభువు తానే దావీదు వంశస్థులకు ఒక సూచన [אוֹת/oth/ఓథ్] చూపును, అది కన్యక [עַלְמָה/alma] గర్భవతియై కుమారుని కనడము.
  • కన్యక గర్భవతియై కనిన కుమారునికి ఆమె ఇమ్మానుయేలు [దేవుడు మనకు తోడు] అనే పేరుతో పిలవటము [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము].
  • ఆ కుమారుడు కీడును విసర్జించించి మేలును కోరుకొనే వయస్సుకు చేరుకున్నప్పుడు పెరుగు తేనే తినును. ఇది 1-3 సంవత్సరాలు వయస్సులో జరిగే విశయము.
  • ఆ కుమారునికి పెరుగు తేనెను తినే వయస్సు రాకముందే దావీదు వంశస్థులను భయపెట్టే యిద్దరు రాజుల దేశము [הָאֲדָמָה֙/హఅధామహ్/HaAdham] నిర్లక్ష్యము/పాడుచేయబడును [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట]

యెషయా.7:16 లో గమనించాల్సిన అంశాలు:

  • “కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును” అన్న వివరణ యొక్క నెరవేర్పు ఎక్కడో ఒకదగ్గర వ్రాయబడి వుండాలి నియమమేదీ లేదు.
  • ఈ సందర్భములో యివ్వబడుతున్న ప్రవచనము రాజైన ఆహాజుకు మాత్రమే పరిమితమవడము లేదు. 13-14 వచనాల ప్రకారము ఇక్కడ యివ్వబడుతున్న ప్రవచనము దావీదు వంశస్థులందరిని ఉద్దేశించి యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
  • చరిత్రను పరిశీలించి చూస్తే ఈ ప్రవచన యొక్క నెరవేర్పు యషువ [యేసు] జనన సమయములో చోటుచేసుకున్న సత్యము అవగతమవుతుంది.
  • దావీదు వంశస్థులు భయపెట్టే యిద్దరు రాజుల దేశము నిర్లక్ష్యము చేయబడును. నిర్లక్ష్యము లేక విడిచిపెట్టబడుట అన్నది యిద్దరు రాజులకుజరిగే విశయముకాదు. అది రెండు దేశాలుకు జరిగే విశయముకూడా కాదు. అది యిద్దరు రాజులు [వేరువేరు సమయాలలో] పాలించిన ఒకే దేశానికి సంభవించే విశయము.
  • దావీదు వంశస్థులను భయపెట్టిన యిద్దరు రాజులు షొమ్రోనురాజు మరియు సిరియారాజు. షొమ్రోను రాజులు ఉత్తరదేశమైన ఇశ్రాయేలురాజ్యమును పాలించారు. కాని, వారిదేశాన్ని సిరియా రాజులు జయించి పాలించటం జరిగింది. ఆ విధంగా ఈ దేశము రెండు రాజుల దేశముగా ప్రవచనవాక్యము గుర్తిస్తున్నది. అయినా ఈ సంఘటన రాజైన ఆహాజు కాలములో సంభవించలేదు. కనుక, ఇది ఆహాజునుద్దేశించి చెప్పబడిన ప్రవచనము కాదు అన్నది సుస్పష్టము.

యెషయా.7:13-16 లేఖనాలలోని ప్రవచన నెరవేర్పులు క్రొత్తనిబంధన గ్రంథములో యివ్వబడ్డాయి. యోసేపు ప్రధానము చేసుకున్న కన్యమరియ ఒక అద్భుతముద్వారా కన్న యషువ [యేసు] యొక్క జననములో ఈ ప్రవచన నెరవేర్పును చూడగలము:

40 క్రీ.పూ. లో రోమా ప్రభుత్వము ఎదోమీయుడైన హేరోదు [Herod the Great] ను ఇశ్రాయేలుదేశముతో [షొమ్రోను రాజ్యానికి] కలిపి ఎదోము మరియు యూదా దేశాలకు రాజుగా నియమించింది.

4 క్రీ.పూ.లో హేరోదు మరణించాడు (మత్తయి.2:19-22). అయితే, అదే సంవత్సరము హేరోదురాజు కుమారుడు ఆర్కెలాయు [Herod Archelaus] తండ్రి స్థానములో ఒక రాజుగా కాకుండా మొదట కేవలము ఒక నాయకునిగా అటుతరువాత రోమా చక్రవర్తి గుర్తింపుతో ఒక ‘జాతీయ నాయకుడు’ [Ethnarch] అన్న బిరుదుతో మాత్రమే హేరోదు రాజ్యములోని ప్రధాన భాగాలైన యూదా, సమరయ, మరియు ఎదోములకు నాయకునిగా వ్యవహరించాడు.

కన్యమరియ కుమారుడు యషువ [యేసు] 4 క్రీ.పూ. వ సంవత్సరములో జన్మించాడు అన్నది చరిత్రకారుల అంచనా. ఆ సంఘటన తరువాత ఒక సంవత్సరములోపే హేరోదు కూడా మరణించాడు. ఈ రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు ఒకే సంవత్సరములో చోటుచేసుకున్నా మొదటిది సంవత్సరములోని ఆదిలో రెండవది అదే సంవత్సరపు చివరలో చోటుచేసుకున్న సంఘటనలుగా అర్థముచేసుకోవచ్చు.

పై చారిత్రక వాస్తవాల వెలుగులో దావీదు వంశస్తులను భయపెట్టిన రెండు రాజుల దేశమైన సమరయ లేక ఇశ్రాయేలుదేశం యషువ [యేసు] పుట్టి కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే అంటే 3 క్రీ.పూ. వ సంవత్సరమునుండి 6 క్రీ.శ. వ సంవత్సరము మధ్య రాజులేని రాజ్యంగా నిర్లక్ష్య స్థితికి [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట] దిగజారింది.
ఇది యెషయా.7:16 యొక్క స్పష్టమైన నెరవేర్పు. ఈ లేఖనములోని ప్రవచన నెరవేర్పు యెషయా.7:14లో దేవుడే యిచ్చిన సూచన అయిన “కన్యక గర్భము ధరించి కుమారుని కనును” అన్న ప్రవచనము యొక్క స్పష్టమైన నెరవేర్పే యషువ [యేసు] యొక్క జననము.

అభ్యంతరము #6

“యెషయా.7:14 లో “కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అన్న ప్రవచనము ప్రకారమే మరియ కన్యక అయివుండి యేసు [యషువ] ను కంటే మరియ ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టినట్లు ఎక్కడ వుంది?”

వివరణ:

పై లేఖనములోని ప్రవచనాన్ని గమనించాల్సిన అంశాలు:

ఈ లేఖనములోని ప్రధానమైన ప్రవచనము దేవుని సూచన అంటే “కన్యక గర్భవతియై కుమారుని కనటము.” ఆ కుమారునికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడము/పిలవడము అన్నది ద్వితీయశ్రేణి అంశము.

ఆ పేరుపెట్టేది లేక ఆ పేరుతో పిలిచేది ఆయన తల్లి.

యెషయా 8:3 లోని ఆజ్ఙ ప్రకారము తన కుమారునికి మహేరు షాలాల్ హాష్ బజ్ అన్న పేరు పెట్టమని దేవుడైన ప్రభువు ప్రవక్త అయిన యెషయాకు ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙకు లోబడి ప్రవక్త అయిన యెషయా ఆ పేరు తన కుమారునికి పెట్టాడు అన్నది ఇంగితజ్ఙానమున్న నిజవిశ్వాసులు ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. కాని, దాని నెరవేర్పు వివరాలు లేఖన గ్రంథములో [పాతనిబంధనలో] లేవు. అలా వుండాలి అన్న నియమమేదీ లేదు. పేరుపెట్టిన వివరాలు గ్రంథములో లేని కారణాన్నిబట్టి యెషయా తన కుమారునికి దేవుడు చెప్పిన పేరును పెట్టలేదు అని వూహించుకోవటము సరికాదు.

పైన యివ్వబడిన లేఖన మాదిరిని అనుసరిస్తూ చూస్తే కన్యమరియ తన కుమారుని ఇమ్మానుయేలు అని పిలుచుకొన్నదని గ్రహించటానికి ఇంగితజ్ఙానముంటే సరిపోతుంది.

చివరిగా, ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు” అని భావము. కన్యమరియ కుమారునికి దేవదూత ఆజ్ఙనను అనుసరించి యోసేపు యషువ [యేసు] అని పేరుపెట్టాడు. యషువ/యేసు [ישובה/Yah’Shua] అంటే “యెహోవా రక్షించును” అని భావము. “యెహోవా రక్షించును” అంటే “దేవుడు మనకు తోడు” అనే కదా దాని భావము! దేవుడు మనకు తోడు లేకపోతే “యెహోవా రక్షించును” అన్నది సాధ్యము కాదు. అందుచేత, “యెహోవా రక్షించును” అన్న పదజాలములో “దేవుడు మనకు తోడు” అన్న సత్యము నిక్షిప్తమై వున్నది. ఈ కారణాన్ని బట్టే యెషయా.7:14 లోని ప్రవచన నెరవేర్పు కన్యమరియ కుమారుడైన యేసు వారి జననము అన్నది మత్తయి.1:21-22 లో నిర్ధారించబడింది. ఈ ఉత్కృష్టమైన దైవసత్యాన్ని అవిశ్వాసులు అజ్ఙానులు గ్రహించజాలరు, విడమర్చిచెప్పినా స్వీకరింపలేరు.

అభ్యంతరము #7

“క్రైస్తవులు క్రొత్తనిబంధన గ్రంథములో క్రింది విశయాలు వ్రాసుకొన్నారు:

“యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; (మత్తయి.1:18-20)

“క్రైస్తవులు పైవిధంగా వ్రాసుకున్నారు కాబట్టి తద్వారా వారు పరాయి వ్యక్తి భార్యను అంటే యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు అని చెప్పడముతో సమానము. ఈ రకమైన విశ్వాసముగల క్రైస్తవుల ఆలోచనావిధానము మతము ఎంత మూర్ఖమైనదో చెడ్డదో అర్థమవుతున్నది.”

వివరణ:

క్రొత్తనైబంధన గ్రంథము క్రైస్తవులు వ్రాసుకున్న గ్రంథము కాదు. యేసే [యషువ] క్రీస్తు [హమషియాఖ్] అన్న విశ్వాసములోకి వచ్చిన యూదులు దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాసిన లేఖనాల సంపుటి క్రొత్తనిబంధన గ్రంథము.

క్రొత్తనిబంధన గ్రంథము దైవగ్రంథముగా విశ్వసించే ఏ క్రైస్తవుడుకూడా “యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు” అని విశ్వసించడు, చెప్పజాలడు. నిజానికి ఇంతటి నీచమైన నికృష్టమైన తలంపే క్రైస్తవుల దరికికూడా రాదు. ఈ రకమైన తలంపును భావనను క్రైస్తవులకు అంటగట్టే ప్రయత్నము చేసే వ్యక్తులు ఈ ప్రయత్నములో తమ స్వభావము తమను ప్రభావితం చేస్తున్న తమ మతస్వభావము ఎంత సంస్కారహీనమైనవో నీచాతినీచమైనవో నిరూపిస్తున్నారు. ఈ రకమైన అలోచనా సరళి దైవవిరోధి అయిన బయెల్జెబూలు [בַּעַל זְבוּב/Baal Zebub] యొక్క దాసుల ప్రత్యేకత.

ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభువైన దేవున్ని ఈ రకమైన దూషణకు గురిచేసేవారు అత్యంత శాపగ్రస్తులు. వారు అతిగొప్ప శిక్షకు పాత్రులు. అలాంటివారికి వారి మాటలతీరుకు దూరంగా వుండటం దైవసంబధులకు శ్రేయస్కరం!

 

Permalink to single post

తనాక్ లోని రాబోవు కారణజన్ములు

దాదాపు వెయ్యి సంవత్సరాల కాలపరిధిలో వ్రాయబడిన హీబ్రూ మరియు అరామిక్ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము (తనాక్) లో రాబోవు దినాలలో నెరవేర్చబడబోతున్న ఐదు ప్రాముఖ్యమైన పాత్రలను గురించిన భవిశ్యవాణులు ఇవ్వబడ్డాయి. అవి క్రింద ఇవ్వబడిన పాత్రలు:

  1. ప్రవక్త (ద్వి.కాం.18:15-18 = అపో.కా.3:12-26)
  2. పాలకుడు (2 సమూయేలు 7:12-16; 1రాజులు.6:12; కీర్తన.89:19-37, 132:11-12; యెషయా.9:6, 55:4; యిర్మీయా.33:19-26; దానియేలు.7:13-14, 8:25; మీకా.5:2 = మత్తయి.2:1-2, 5; ప్రకటన.1:5)
  3. ప్రధానయాజకుడు (కీర్తన.110:4 = హెబ్రీ.5:5-6, 6:20, 7:11-25)
  4. అభిశిక్తుడు లేక క్రీస్తు (యెషయా.61:1; దానియేలు.9:25-26 = మత్తయి.16:16, 26:63-64; లూకా.2:11, 4:17-21,41; యోహాను.1:41, 4:25, 11:27)
  5. ఏలియా (మలాకి.4:5 = మత్తయి.11:7-15, 17:11-12; లూకా.1:13-17)
Permalink to single post

దైవోక్తులపై ఒక అవిశ్వాసి అపనింద

అవిశ్వాసి అపనింద

“సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!!

…నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు,పాపక్షమాపన ,చనిపోయి లేచుట,అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని,చెప్పారని ఉంది.అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలులేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలేలేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను అడిగినప్పుడు ఆధారాలు చూపాలి…ఆడిగినవాటికి లేఖనాలు లేనట్లా? ఉన్నట్లా? లేనట్లయితే యేసు మొదలుకుని క్రొత్తనిబంధన బోధకుల బ్రతుకులు ఏంటి?సమాధానం కోరుతున్నాను”
ఇట్లు,
అవిశ్వాసి [అసత్యాన్ని హత్తుకున్న]

విశ్వాసి వివరణ

దైవోక్తులు (లేఖనాలు) అన్నవి కొన్నిసార్లు అస్పస్టంగా మరికొన్నిసార్లు నిగూఢంగా యివ్వబడటము సహజం. ఇక భవిశ్యత్తుకు సంబంధించిన ప్రవచనాలైతే (భవిశ్యవాణి) యింకెంతో మర్మఘర్భితంగా యివ్వబడుతాయి అన్నది లేఖనాలనుగూర్చిన కనీసజ్ఙానమున్న ఎవరికైన యిట్టే అర్థమయ్యే విశయము. ఈ కారణాన్ని బట్టి ధార్మిక గ్రంథాలను పరిశోధించే విజ్ఙులు తమకు అర్థంకాని లేక గ్రహించలేని ప్రవచనాలతో కూడిన ధార్మిక వివరాలను బట్టి ఆ గ్రంథాలను తప్పుబట్టే ప్రయత్నము చేయరు.

అయితే ఇహలోక మతచాందసులు మాత్రం తమ మతము సహితం అధారముగా తీసుకున్న మూలమతాలనుకూడా తప్పుబడుతూ వాటి లేఖనగ్రంథాలను తిరస్కరిస్తూ తమ తర్కరాహిత్య కుసంస్కారాన్ని అందరిముందూ ప్రదర్శిస్తుంటారు. అలాంటివారిది యితరమతాలపై యితర గ్రంథాలపై దుమ్మెత్తిపోస్తేనేగాని తమ మతాన్ని అమాయకులకు నమ్మబలికే విధంగా ప్రచారంచేసుకోలేని దౌర్భాగ్య స్థితి. అది వారి మతము యొక్క దివాళుకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటివారికి దైవసత్యం అవగతం కాదు. వారికివ్వబడిన దైవసత్యమన్నది బూడిదెలో పోసిన పన్నీరులాంటిది. నిజానికి ప్రభువైన యేసు క్రీస్తు అలాంటివారినుద్దేశించే ఈమాటచెప్పాడు:

పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్ట వద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయొద్దు. అలాచేస్తే పందులు వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. కుక్కలు మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.” (మత్తయి 7:6)

ఈ సంధర్భంగా ప్రశ్న అడిగిన విధానాన్నిబట్టి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క నైజము ప్రభువైన యేసు క్రీస్తు మాటలలోని ప్రాణుల నైజానికి ధీటుగా వున్నా ఆప్రశ్నలో లేవనెత్తబడిన అంశాలకున్న చెల్లుబాటును బట్టి సత్యాన్వేశకులైన విజ్ఙులెవరైనా వుంటే వారికి ఉపయుక్తకరంగా వుండేందుకై అడగబడిన ప్రశ్నకు వివరణతోకూడిన జవాబే క్రింద యివ్వబడిన స్పందన.

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో మానవకోటి మనుగడకు అవసరమైన అత్యంత ప్రధానమైన సత్యాలన్నీ అందించబడ్డాయి. ఇహలోకానికి మరియు పరలోకానికి సంబంధించిన సత్యాలన్నీ క్రోడీకరించబడి అక్షర రూపంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిలుగా భద్రం చేయబడ్డాయి. అందుకే బైబిలును దైవ గ్రంథమని, పరిశుద్ధ గ్రంథమని, లేఖనాలని వివిధ పేర్లతో పేర్కొనడం జరుగుతుంది. ఈ గ్రంథంలోని అతిప్రధానమైన సత్యం మానవ కోటిని పాపము యొక్కయు మరియు సాతానుయొక్క దాసత్వాలనుండి రక్షించి పరలోక ముక్తిని ప్రసాదించే దైవాంశసంభూతుడైన యేసు క్రీస్తు ప్రభువును గూర్చినది.

బైబిలుకున్న విశిష్టతలలో ఒకటి యదార్థ హృదయంతో దేవుని అన్వేషిస్తున్నవారి గ్రహింపు స్తోమత యేస్థాయిలో వున్నా వారి స్థాయికి తగిన విధంగా విశదమయ్యే వివరణలు కలిగి వుండటమే. పండితులూ, పామరులూ యింకా చెప్పలంటే సాధారణ వ్యక్తులూ అందరూ ఆకళింపు చేసుకోగలిగే విశయాలు ఈ గ్రంథములో వున్నాయి. అయితే, ఈ గ్రంథాన్ని ధ్యానించటానికి సమీపించే వ్యక్తి యదార్థ హృదయంతో సత్యాన్వేశకునిగా గ్రంథాన్ని సమీపించాలి. మూఢత్వం, అహంకారం, స్వనీతి, ముందే నిర్ధారించుకొన్న అభిప్రాయాలు, తప్పులు వెదకాలన్న కుయుక్తి మొదలైనవాటితో బైబిలును సమీపించే వారికి సత్యం అవగతం కాకపోగా వారి స్వభావాన్ని ప్రతిబింబించే అపార్థాలే పుట్టుకొస్తాయి.

బైబిలులోని సత్యాలను కొందరు గ్రహించలేకపోవడానికి బైబిలు తెలియచేస్తున్న ఐదు కారణాలు

1) కొందరు బైబిలును అసలు చదవకుండానే లేక ఆసాంతము చదవకుండానే లేక దాన్ని చదవాల్సినవిధంగా చదవకుండానే యెవరో చెప్పిన మాటలు విని వాటిని నమ్మి బైబిలుగురించి తప్పుడు అవగాహనను యేర్పరచుకొని ఆ అజ్ఙానములో కొనసాగుతుంటారు. ఆ విధానము వారిని నాశనమార్గము వైపుకు నడుపుతుంది. అలాంటివారికి దైవసత్యం యెప్పటికీ అందదు. (మత్తయి 22:29)

2) కొందరు అబద్దికులును మరియు మోసగాడ్రునై యుండి యితరులను దురాత్మల బోధలలోనికి తీసుకొనివెళ్ళే ప్రయత్నంలో భాగంగా బైబిలులో తప్పులు వెదికేందుకే దాన్ని పఠిస్తారు. అలాంటివారికి అందులోని సత్యం ససేమిరా అవగతం కాదు. (1తిమోతి 4:1-2)

3) కొందరు తమ మూర్ఖత్వాన్నిబట్టి మోసపోయిన కారణంగా వారి మనోనేత్రాలకు సాతానుడు అంధకారం కలుగజేశాడు. అలాంటివారికి బైబిలులోని సత్యాన్ని వీక్షిచడము అన్నది అసాధ్యమైన విశయం. (2 కొరింథీ 4:4)

4) కొందరు అహంకారంతో దైవసత్యాన్ని తిరస్కరించి అవిధేయతతో స్వనీతిపై ఆధారపడుతూ తమ స్వంత ప్రయత్నాలతో ముక్తిని సంపాదించుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. అలాంటివారి హృదయాలను సృష్టికర్తే కఠిన పరచడం జరుగుతుంది. కనుక అలాంటివారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే కొనసాగుతుంటారు (కీర్తనలు 81:11-12; యెషయా 6:9-10; మత్తయి 13:13-15; 2 థెస్సలోనీకయులకు 2:9-12). అలాంటివారికికూడా బైబిలులోని దైవసత్యం సుదూరం.

5) చివరగా, కొందరికి అజ్ఙనాన్నిబట్టి అలాగే మందమతినిబట్టి హృదయాలు మూయబడివుంటాయి. ఈ కారణాన్నిబట్టికూడ లేఖనసత్యాన్ని గ్రహించలేరు. అయితే అలంటివారు యదార్థ హృదయాలతో దేవున్ని ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేశిస్తున్నట్లయితే వారు లేఖనాలలోని దైవసత్యాన్ని గ్రహించేందుకు వీలుగా వారి హృదయాలను దేవుడే తెరవడం జరుగుతుంది (లూకా 24:25-32, 45).

ప్రశ్నలో పేర్కొనబడిన బైబిలు లేఖనాలు

(1)24 మానవపుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది.” 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం…55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.” (మత్తయి 26:24-28…55-56)

(2)12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.” (మార్కు9:12-13)

(3)24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25 అందుకాయన “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని చెప్పాడు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు…44 తర్వాత ఆయన “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.46 “క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.” (లూకా24:25-27…44-48)

(4)8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు…43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార” ని చెప్పాడు.” (అ.కార్య. 3:8…10:43)

(5) “3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. 5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండుమందికీ కనబడ్డాడు.” (1కోరింథీ.15:3-5)

ప్రశ్నలో పేర్కొనబడిన బైబిలు లేఖనాల వివరణ

(1)24 మానవపుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది.” 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం…55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.” (మత్తయి 26:24-28…55-56)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

“12…ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను” (యెషయా 53:12)“

7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.” (జెకర్యా 13:7)

యేసు ప్రభువులవారు సెలవిచ్చిన విధంగా యెషయా 53:12 మరియు జెకర్యా 13:7 లోని ప్రవచనాల సారాంశము లుకా సువార్తలోని 26:55-56 లో నెరవేర్చబడింది.

(2)12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.” (మార్కు 9:12-13)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. 6 నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకి 4:5-6)

3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.” (యెషయా 53:3-7)

మార్కు సువార్త 9:12-13 వరకుగల లేఖనాలలో యేసు ప్రభువు వివరిస్తున్న విశయాలు ప్రవక్తలైన యేషయా (53:12) మరియు మలాకి (4:5-6) వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాల సమిష్టి నెరవేర్పు అన్నది గుర్తించవచ్చు.

(3)24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25 అందుకాయన “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని చెప్పాడు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు…44 తర్వాత ఆయన “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.46 “క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.” (లూకా24:25-27…44-48)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధన లేఖనాలలోని మచ్చుకు కొన్ని…

ప్రవక్త అయిన మోషే వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆదికాండము 3:15)“

16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిచొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. 17 మరియు యెహోవా నాతో ఇట్లనెను. –వారు చెప్పిన మాట మంచిది; 18 వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. 19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దానిగూర్చి విచారణచేసెదను.” (ద్వి.కాం. 18:16-19)

ప్రవక్త అయిన దావీదు వ్రాసిన కీర్తనలలోని ప్రవచనాలు:

6 నేను నరుడను కాను నేను పురుగును. నరులచేత నిందింపబడిన వాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. 7 నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. 8 యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా! ఆయన వానిని తప్పించునేమో అందురు. 9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా! నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా! నాకు నమ్మిక పుట్టించితివి. 10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా దేవుడవు నీవే. 11 శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు. నాకు దూరముగా నుండకుము. 12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. 13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు. 14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను. నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. 15 నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని యున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. 16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు. నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. 17 నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.” (కీర్తనలు 22:6-18)

8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను. 9 అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది 10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు 11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తనలు 16:8-11)

18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు.” (కీర్తనలు 68:18)

ప్రవక్త అయిన యెషయా వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 2 అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు 3 నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. 4 భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును. 5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 6 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును 7 యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. 8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. 9 మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. 10 సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. 11 అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. 12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక.” (యెషయా 42:1-12)

6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. 7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు. 8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.” (యెషయా 49:6-8)

2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. 3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. 8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? 9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. 10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.” (యెషయా 53:2-12)

(4)8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు…43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార” ని చెప్పాడు.” (అ.కార్య. 3:8…10:43)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధనలోని మచ్చుకు కొన్ని లేఖనాలు…

18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెన నెను.” (ఆదికాండము 22:18)

43 జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం. 32:43)

1 అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును. ” (యెషయా 9:1-2)

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:11)

14 సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు 7:14)

23 నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ 2:23)

1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.” (జెకర్యా 13:1)

28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸°వనులు దర్శనములు చూతురు. 29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును. 30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను 31 యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. 32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:28-32)

11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు 12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు 9:11-12)

గమనిక: ప్రవక్తలు దేవుడు తన క్రీస్తు ద్వారా జనులందరిని అశీర్వదించబోతున్న విశయాన్ని ప్రవక్తల ద్వారా రకరకాలుగా పైన ఉదహరించిన విధంగా మర్మఘర్భిత వాక్కులద్వారా సూచించాడు. ఆ విశయమే అపోస్తలుల కార్యములు 10:43 లో ప్రవక్తల సమగ్రసారాంశముగా పేర్కొనబడింది.

(5)1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ చెబుతున్నాను. మీరు దానిని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు. 3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.” (1 కొరింథీ.15:1-4)

పై లేఖనాలలో గమనించాల్సిన ముఖ్య అంశాలు:

1. అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు (వ.1)

2. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలు:

– క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు (వ.3)
– క్రీస్తును సమాధి చేశారు (వ.3)
– దేవుడు క్రీస్తును మూడవ రోజున తిరిగి లేపాడు (వ.3)

3 అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలకున్న మూలాధారం:

– దేవుడు అనుగ్రహించిన ఉపదేశం (వ.3)
– లేఖనాలు (వ.3)

పై ముఖ్య అంశాలపై కొంత వివరణ:

లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మరిముఖ్యంగా ప్రవచన భాగాలను పరిశోధిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విశయం ఉత్కృష్టమైన సత్యాలు దైవోక్తులలో చాలావరకు మర్మఘర్భితంగా యివ్వబడ్డాయి అన్న సత్యం. ఇందునుబట్టే సత్య పరిశోధకులు లేఖనాలను జాగ్రత్తగా మరియు లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలకున్న మూలాధారాలు రెండు.

(1) దేవుడే అనుగ్రహించిన ఉపదేశం. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణలో (inspiration) సువార్తనుగూర్చి పౌలుకు యివ్వబడిన ప్రత్యక్షతను (revelation) సూచిస్తున్నది. గమనించాలి, యిది పౌలు పాత నిబంధన లేఖనాలను చదివి గ్రహించిన సారంశము అని తలంచకూడదు. నిజానికి యిది ఆత్మావేశములో తిన్నగా దేవుని యొద్దనుండే యివ్వబడిన ప్రత్యక్షత.

(2) లేఖనాలు. ఇక్కడ లేఖనాలు (Scriptures) అన్న పదము పాత నిబంధన (Old Testament) మరియు క్రొత్త నిబంధన (New Testament) రెండు గ్రంథాలను సూచిస్తున్నది. ఈ సందర్భంగా గమనించాల్సిన విశయమేమిటంటే అపోస్తలుడు “లేఖనాల ప్రకారం” అన్నాడే కాని ధర్మశాస్తములో వ్రాయబడినట్లుగా అనిగాని లేక ఫలాన ప్రవక్త వ్రాసినట్లుగా అనిగాని చెప్పడం లేదు. ఒకవేళ 1 కొరింథీ. 15: 1-4 వరకుగల వచనాలలో “‘క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు’ అని లేఖనాలలో వ్రాయబడినట్లు” అనిగాని లేక లేఖనాలలో “‘ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు’ అని వ్రాయబడి వున్నట్లు” అనిగాని వుంటే అప్పుడు లేఖనాలలో సరిగ్గా అదే పదజాలాన్ని వెతికి చూడాల్సివచ్చేది. అంటే, లేఖనాలను యెత్తి వ్రాసినప్పుడు (copy) మాత్రమే వివరణలోని పదజాలము మూలములోని పదజాలముతో సమాంతరంగా వుండాలి (direct speech as opposed to reported speech). కాని వాస్తవమేమిటంటే అపోస్తలుడు అదివరకే యివ్వబడిన ప్రవచన లేఖనాలలోని సందేశాన్ని క్రోడీకరిస్తూ వేరే పదాలతో దాని సారాంశాన్ని వ్యక్తం చేసాడు (i.e.reported speech). అయినా అది ఆయన స్వంత యిచ్ఛను బట్టి కాదుగాని పరిశుద్దత్మ ప్రేరణలోనే (inspiration) అది చేశాడన్నది మరవకూడదు. ఇక్కడ గమనములో వుంచుకోవలసిన మరొక విశయమేమిటంటే “లేఖనాల ప్రకారం” అన్న పదజాలము యొక్క భావం లేఖనాల సారాంశము అని గ్రహించాలి. ఇందుకు సంబంధించిన లేఖనాల ఆధారాలు ఈ క్రింద యివ్వబడ్డాయి…

పాత నిబంధన లేఖనాధారాలు:

– కీర్తనలు 16:8-10 = అపోస్తలుల కార్యములు 2:31 & 13:35-39
– కీర్తనలు 22:1,6-8,13-18
– యెషయా 53:4-12
– దానియేలు 9:24-26
– జెకర్యా 13:7

క్రొత్త నిబంధన లేఖనాధారాలు:

– మత్తయి.16:21
– మత్తయి.17: 22-23
– మత్తయి.20:18-19, 28.
– మర్కు.8:31
– మర్కు.9:31
– మర్కు.10:33-34

అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15:1-4 వరకుగల వాక్యాలలో వివరించిన సత్యాలన్నీకూడా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథాలలోనుండి పైన పేర్కొనబడిన లేఖనాల సారాంశమన్నది అత్మలో వెలిగించబడినవారు యిట్టే గ్రహించగలరు.

సత్యాన్ని ప్రేమిస్తూ అన్వేశిస్తున్న వారందరినీ దేవుడు దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక! ఆమెన్!

Permalink to single post

నిజదేవుని ప్రవృత్తి

సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడిందిగనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి బైబిలులోని ప్రత్యక్షతలనుగురించిన విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.

పాతనిబంధన గ్రంథములో అంటే యూదుప్రవక్తలద్వారా యివ్వబడిన హీబ్రూ లేఖనాలలో (తనాఖ్) తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైన హీబ్రూ పదాలను ధ్యానించడం ఆవశ్యకం–‘యఖీద్’ (יָחִיד = yahid or yachid) మరియు ‘ఎఖద్’ (אֶחָד = ehad or echad). ఎఖద్ అన్న పదానికి గణితశాస్త్ర సంఖ్య ఒకటి, సమిష్టి ఐఖ్యత, సామూహ ఏకత్వం వంటి అర్థాలు (ఉదా: ఆది.కాం. 2:24, 11:6; ద్వి.కాం.6:4), అలాగే యఖీద్ అన్న పదానికి ఏకైక, ఒకేఒక్క, ఏకాకి, ప్రియమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన వంటి అర్థాలు (ఉదా: న్యాయాధిపతులు 11:34; కీర్తనలు 25:16; 68:6) ఉన్నాయి.

(1) ఎఖద్ అనే “సమూహ ఏకత్వాన్ని” సూచించే హీబ్రూ భాషా పదం సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని ప్రకటించిన సంధర్భంలో ఆయన ఏకత్వాని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడింది (ద్వి.కాం.6:4). అయితే, ఈ పదం ఒక్కసారయినా నరుని ఏకత్వాన్ని సూచించడానికి వుపయోగించబడలేదు.”ఒక్క దేవుడు” అంటే సంఖ్యాపరంగా ఒకదేవుడని భావం (ఉదా: ఒక్క దేవుడు, యిద్దరుదేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు…). ఒక్క/ఒక్కడు/ఒక్కటి అన్న గణితశాస్త్ర సంఖ్య గణితశాస్త్ర సూత్రాలకు లోబడుతుంది. అయితే నిజమైన దేవుడు ఏశాస్త్రానికి లోబడడు లేక పరిమితి కాజాలడు. కనుక, ఆ కారణాన్ని బట్టి గణితశాస్త్రపరమైన ఒక్కటి/ఒక్కడు (one/1) అన్న భావార్థం నిజదేవునికి అన్వయించతగదు.

“దేవుడు ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో నిజదేవునిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. ఇదే సత్యాన్ని మరొకవిధంగా చెప్పలంటే దేవుడు అద్వితీయుడు. అంటే, ఆయనను పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు.

“దేవుడు ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే దేవుడు ఒంటరివాడు మరియు ఆయనలో ‘సమూహ ఏకత్వం’ అన్నది యేదిలేదన్నది సూచించబడుతున్నది. అయితే, హీబ్రూలేఖనాలలో ఎక్కడా దేవుని ఉనికి/అస్తిత్వానికి సంబంధించి ఈవిశయం చెప్పబడలేదు అన్నది గమనించదగిన విశయం. దీన్ని బట్టి యూదు లేఖనాలలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ఏకాకి లేక ఒకేఒక్కడు (יָחִיד = యఖీద్) కాదు అన్నది సుస్పష్టం.

(2) నరుని ఏకత్వాన్ని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడిన హీబ్రూ భాషా పదం యఖీద్. (ఉదా: న్యాయాధిపతులు 11:34). కాని, ఈ పదం ఒక్కసారయినా దేవుని ఏకత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడలేదు అన్నది మరవకూడదు.”ఒక్క మనిషి” అంటే సంఖ్యాపరంగా ఒకమనిషని భావం (ఒక్క మనిషి, యిద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు…). “మనిషి ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో మనిషిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. కాని, హీబ్రూ లేఖనాలలో యెక్కడాకూడా మనిషి వునికికి సంబంధించి ఈలాంటి పదజాలం వుపయోగించబడలేదు. ఇందును బట్టి యూదు లేఖనాలు మనిషి ‘ఒక్కడు’ (אֶחָד = ఎఖద్) లేక ‘సమూహ ఏకత్వం’ కలవాడు అని బోధించడం లేదన్న వాస్తవం నిర్ధారించుకోవచ్చు.

“మనిషి ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే మనిషి ఒంటరివాడు మరియు అతనిలో ‘సమూహ ఏకత్వం’ ఏదీలేదన్నది సూచించబడుతున్నది. ఈ సత్యాన్ని హీబ్రూ భాషలోని యూదు లేఖనాలు నిర్ద్వంధంగా సూచిస్తున్నయి (కీర్తనలు 25:16; 68:6). దాదాపు ముప్ఫైమంది దైవాత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలద్వార హీబ్రూలేఖన గ్రంథాలసంపుటి అయిన పాతనిబంధన మానవాళికి అందించబడింది. 39 లేఖన గ్రంథాల సంపుటి అయిన పాతనిబంధనలో ఎఖద్ అన్న పదం 967 సార్లు అలాగే యఖీద్ అన్న పదం 12 సార్లు వుపయోగించబడ్డాయి. అయితే, అందులో ఒక్క ప్రవక్త అయినా దేవుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘యఖీద్’ (יָחִיד = yachid) అన్న పదాన్ని అలాగే నరుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘ఎఖద్’ (אֶחָד = echad) అన్న పదాన్ని వుపయోగించడం అన్నది జరగలేదు.

దేవుడు ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్) 

అంటే, దేవుడు ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, దేవుని పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు. ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఒక్కడు (ఎఖద్) కాదు’ అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, దేవుడు ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, దేవుని అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకివంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

యెహోవా ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్). అంటే, ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, యెహోవాకు వేరుగా, సాటిగా, పోటిగా మరొకడు లేడు. ఆ గ్రహింపులో యెహోవా ఒక్కడు (ఎఖద్) కాదు అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, యెహోవా ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, యెహోవా అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకి వంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘యెహోవా ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

(ద్వి.కాం.6:4; యెషయా 45:5,6,14; 46:9; మార్కు 12:29; రోమా 3:30)

దేవుడు సర్వవ్యాప్తి

దేవుడు అంతటా వ్యాపించి వున్నాడు మరియు ఆయన లేని స్థలము అంటూ లేదు. ఈ గుణలక్షణాన్నిబట్టి నిజదేవుడు ఒకేసమయంలో తన ఇచ్ఛప్రకారం రెండు లేక అంతకన్న ఎక్కువ స్థలాలలో ప్రత్యక్షంకూడా కాగలడు. ఇది సృష్టికి (నరులకు) అసాధ్యం, కాని సృష్టికర్తకు (దేవునికి) సుసాధ్యం!

దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులుగా ప్రత్యక్షమైన సందర్భంలో ఇద్దరు దేవుళ్ళు అనిలెక్కించడము లేక తీర్మానిచడము అవివేకం. ఆవిధంగా ప్రత్యక్షమవగలగడం అన్నది దేవుని ప్రవృత్తి. ఈ సందర్భంగా నిజదేవుడు గణితశాస్త్ర పరిధులకు అతీతమైనవాడు అన్న సత్యాన్ని పరిగణాలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాలలోకూడా ఆయన అద్వితీయుడేనన్నది మరువకూడదు. అది సృష్టికి అతీతంగా వుంటూ కేవళము సృష్టికర్తకు మాత్రమే చెందిన దైవప్రవృత్తి.

(కీర్తనలు 139:7-10; యిర్మీయ 23:24; అపో.కా.17:28)

దేవుని స్వభావం వైవిధ్యంతోకూడినది

అంటే, ఆయన ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఇంకా చెప్పలంటే దేవుని అంతర్ఘత అస్తిత్వం సృష్టించబడిన వ్యక్తుల అస్తిత్వాన్ని పోలిన ఏకత్వంలా వుండక సృష్టిలోనే లేని ‘వైవిధ్యంతో కూడిన ఏకత్వాన్ని’ (Unity in Diversity) కలిగి వున్నాడు. బైబిలు పరిభాషలో చెప్పాలంటే, ఆయన తండ్రికుమారపరిశుద్ధాత్ములనే వైవిధ్యంతో కూడిన ఏకత్వమై యున్న అద్వితీయదేవుడు [అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;].

(ఆది.కాం.1:26; యెషయా 48:15-16; జెకర్యా 2:8-11; మలాకి 3:1; మత్తయి 28:19; యోహాను 1:1, 18)

దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించినా ఆయన అనేక విధాలుగా నరులకన్నా ఎంతో గొప్పవాడు మరియు వైవిధ్యమున్నవాడు. కనుక, దేవుడు నరులలాంటి వాడు కాదు అన్నది నిరాపేక్షమైన మాట. సర్వసాధారణంగా ఒక నరునిలో/మానవదేహములో ఒక వ్యక్తిమాత్రమే అస్తిత్వాన్ని కలిగివుంటాడు. దేవుడుకూడా అలాగే వుండాలన్న నియమమేదీ లేదు. మరోమాటలో చెప్పాలంటే, నరులలో లేని వైవిధ్యం/బహుళత్వం దేవునిలో వుండే అవకాశం వుంది. నిజానికి వుంది అని గ్రహించడానికి పైన వివరించిన విధంగా లేఖనాలు తిరుగులేని ఆధారాలెన్నో అందిస్తున్నాయి.

సృష్టికర్త ప్రవృత్తిని సంపూర్ణంగా కాకపోయినా పరిమితస్థాయిలోనైనా సరిగ్గా అవగాహన చేసుకోవటానికి మానవ మేధస్సుకు వున్న పరిమితులే పెద్ద ఆటంకం అన్నది లేఖనాల ప్రకటన:

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)

Permalink to single post

అంత్యకాల జూడాయిజం

ప్రపంచంలోని ప్రాచీన మతాలలో జుడాయిజం (Judaism) లేక యూదుమతం ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో (Middle-East) ఆవిర్భవించినా ప్రపంచములోని అనేక దేశాలలో అనుసరించబడుతున్నది. ఈ మతం ప్రధానంగా యూదులమధ్య యూదులకొరకు యూదు మతపెద్దలైన రబ్బీలచేత ప్రారంభించబడినా ఈమధ్యే విస్తృతమైన మతప్రచారాన్ని మతమార్పిడులనుకూడా చేపట్టింది.

గత రెండువేల సంవత్సరాలుగా ప్రపంచములో ఉనికిని కొనసాగిస్తున్న యూదుమతం నిజానికి ఒకప్పటి బైబిలువిశ్వాసం లేక తనాక్ ధార్మిక మార్గం యొక్క కొనసాగింపు కాదుగాని దాని తదనంతరము ఆవిర్భవించి విస్తరిస్తున్న తాల్ముద్ ఆధారిత మతం లేక రబ్బీలమతం అన్నది గమనములో వుంచుకోవాలి. ఈనాటి యూదుమతం (జూడాయిజం) బైబిలు ప్రబోధాలకు మరియు వాటిపై ఆధారపడిన విశ్వాసానికి సుదూరమైనది. నిజానికి దీన్ని ‘అంత్యకాల జూడాయిజం’ అని అభివర్ణించవచ్చు.

‘జూడాయిజం’ (Judaism) మరియు ‘యూదుమతం’ అన్న పదప్రయోగాలు గాని లేక అవి ప్రాతినిథ్యం వహిస్తున్న మతవిధానము గాని క్రీస్తుకు పుర్వమున్న దైవప్రవక్తలెవరు ఎరుగనివి. అయితే, జూడాయిజం [యూదుమతం] అంటే యూదుల మతం అన్నది ఈనాటి సర్వసాధారణ భావం. కాని, పాతనిబంధన గ్రంథం (తనాక్) అంతటిలో ఒక్కసారికూడా ఈ పదం ఉపయోగించబడలేదు. వాస్తవానికి ఈ పదం రబ్బీల సృష్టి!

‘యూదుడు’ అన్నపదం ‘యూదా’ అనే హెబ్రీ నామములోనుండి పుట్టిన పదమైనప్పటికిని ఇది అబ్రహాము ఎరుగని పదం, మోషే ఎరుగని పదం, చివరకు దావీదుగాని లేక అతని సంతానములోనుండి వచ్చిన ఏలికలలోనివారుగాని ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ దాసత్వములోకి వెళ్ళకముందు వరకు ఎరుగని పదం.

ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పదేపదే పాపము చేయడముద్వారా తమతో దేవుడు చేసిన నిబంధనను భంగంచేసి తత్ఫలితంగా దేవుని ఉగ్రతను కొనితెచ్చుకున్నారు. దాని పర్యవసానమే దేవుడు 722 క్రీ.పూ. లో పది గోత్రాలతోకూడిన ఉత్తరరాజ్యం ఇశ్రాయేలును అన్యులైన అష్షూరుదేశస్తులకు అలాగే 586 క్రీ.పూ. లో రెండు గోత్రాలతోకూడిన దక్షిణరాజ్యం యూదాను బబులోనుదేశస్తులకు బానిసలుగా అప్పగించాడు. ఆరకమైన దుస్థితిలో వారు కొనసాగుతున్న సమయములో కేవలము రెండు గోత్రాల ప్రజలను అంటే యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము వారిని సూచిస్తూ పలికేందుకు పుట్టింది ‘యూదులు’ (יְהוּדִים/యెహుదిం) అన్న పదం. ఈనాటి కొందరు యూదు పండితుల అభిప్రాయప్రకారం ఆఫ్రికాలోని నల్లజాతీయులను వివక్షతతో ‘నీగ్రోలు’ అంటూ పేర్కొన్నట్లు అన్యజాతీయులు ఇశ్రాయేలీయుల రెండుగోత్రాలవారిని తిరస్కారభావంతో ‘యూదులు’ అంటూ పిలవడం ప్రారంభించారు. చరిత్రాధారాలను బట్టి చూస్తే ప్రారంభములో బబులోనుదేశస్తులు యూదా రాజ్యములోనుండి వచ్చిన వారందరిని యుదులు అంటూ పిలిచారు. అప్పట్లో ఇది మతాన్నికాక జాతీయతను ఎత్తిచూపే పదంగా ఉపయోగించబడింది.

ఈ నేపద్యంలో ఇశ్రాయేలీయులు చెరలో వున్న సమయములో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలో ‘యూదుడు’ మరియు ‘యూదులు’ అన్న పదాలు చూడగలము. కాలక్రమేణా ఈ పదాలు ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలోనివారికి ఆపాదించడం మొదలైంది. ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలు పాతనిబంధన (తనాక్) బోధలతో మరియు యెరూషలేములోని దేవుని ఆలయముతో ముడిపడివుండటాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి. ఈ కారణాన్నిబట్టి 70 క్రీ.శ. లో రోమీయులు యెరూషలేములో రెండవసారి కట్టబడిన దేవుని మందిరాన్ని ద్వంసముచేయడముతో ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలకు ఉపద్రవం యేర్పడింది. ఈ పరిస్థితి తమ మతగ్రంథాలను సంస్కరిస్తూ క్రొత్త గ్రంథాలను వ్రాసుకునేందుకు యూదుల మతపెద్దలకు అంటే ‘రబ్బీలకు’ తోడ్పడింది.

అప్పటినుండి యూదుజాతీయులు మరియు యూదుమతప్రవిష్టులు (యూదుమతాన్ని స్వీకరించినవారు) బైబిలు గ్రంథబోధలను ప్రక్కకుబెట్టి పాతనిబంధన లేఖనాలకు రబ్బీలు చెప్పే పొంతనలేని వ్యాఖ్యానాలను, వారు చేసే బోధలను, అలాగే వారు ప్రవేశపెట్టిన పితృపారంపార్యాచారాలను పాటించడం మొదలుబెట్టారు.

ప్రఖ్యాత ననాతన యూదు రచయిత మరియు రబ్బీ (యూదు బోధకుడు) ఖెయిం షిమ్మెల్ తాను వ్రాసిన “మౌఖిక తోరా” అన్న గ్రంథములో యదార్థంగా ఒప్పుకుంటూ వ్రాసిన మాటలు:

తోరాలో వ్రాయబడిన అసలు మాటల ప్రకారం యూదులు ఎప్పుడూ జీవించలేదు, అయితే వారు జీవించింది రబ్బీలు ప్రవేశపెట్టిన సంప్రదాయాల ప్రకారం! (రబ్బీ ఖెయిం షిమ్మెల్)

ఈ మతస్తులు తమ మతప్రచారములో ఇతర మతస్తులను ఆకట్టుకునేందుకు హెబ్రీ బైబిలును విరివిగా పేర్కొంటుంటారు. అయినా, వీరి మత విశ్వాసాలు ఆచారవ్యవహారాలు ప్రధానంగా రబ్బీలు చేసిన బోధలపై వారు ప్రవేశపెట్టిన ఆచారాలపై ఆధారపడి వుంటాయి.

యెరూషలేములోని హీబ్రూ విశ్వవిధ్యాలయములో ఆచార్యునిగా పనిచేసిన కిప్పాను ధరించి జుడాయిజములో కొనసాగుతున్న అవిగ్దోర్ షినాన్ ప్రస్తుతమున్న జూడాయిజంలోని వారు పాటించే ఆచారాల మూలాలను వివరిస్తూ చెప్పిన సత్యం,

“మా ధార్మికవిధ్య పాతనిబంధనాగ్రంథంపై (తనాక్ పై) ఆధారపడింది కాదు. ఈనాడు మేము అనుకరిస్తున్న ఆచారాలు పాతనిబంధనాగ్రంథపు ఆచారాలు కావు, అవి మా పూర్వికులలోని విజ్ఙులు (sages) ప్రారంభించిన ఆచారాలు.
      
“సబ్బాతు (విశ్రాంతిదిన) ఆచారాలు, కష్రుత్  నియమాలు మొదలైనవి లేఖనాలలో పాతనిబంధన గ్రంథములో లేనివి. పాతనిబంధనాగ్రంథములో సినగోగు లేదు, కద్దీష్ లేదు, కోల్ నిద్రె లేదు, బార్ మిట్స్ వ లేదు, తల్లీల్ లేదు. ఈనాడు యూదుత్వానికి చెందినదంటూ నిర్వచించబడే వాటిలో మొదలును పరిశోధించి చూస్తే అవి పాతనిబంధనాగ్రంథములోనివి కావుగాని మాపూర్వికులలోని విజ్ఙులు (sages) అందించిన సాహిత్య గ్రంథములలోనివి. అక్కడే ప్రతీది మొదలయ్యింది. యూదుమతం పాతనిబంధ గ్రంథములో ఎక్కడుంది? మోషే యూదుడని పిలువబడలేదు. అబ్రహాముకూడా అలా పిలువబడలేదు. కేవళం మొర్దెకై “యూదుడైన మొర్దెకై” గా పిలువబడ్డాడు, అదీ పాతనిబంధన గ్రంథములోని చివరి భాగములో పారసీకుల కాలములో జరిగిన సంఘటన.” (ఆచార్య అ. షినాన్) 

వీరు ఒకవైపు పాతనిబంధనాగ్రంథము యొక్క సహజ కొనసాగింపుగా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాన్ని తప్పుబడుతూ, తిరస్కరిస్తూ, ఇంకా దానిపై ఎన్నో అసత్యారోపణలు చేస్తూ మరొకవైపు పాతనిబంధనాగ్రంథానికి వేరైన వ్యతిరేకమైన బోధలు కలిగిన రబ్బీల గ్రంథాలలోని అంటే మిష్నా మరియు గమరాలతోకూడిన యెరూషలేము తాల్ముదు, బబులోను తాల్ముదు, జోహర్ మొదలైన బబులోనులోని అన్యుల ప్రభావముతో వ్రాయబడిన గ్రంథాలలోని ప్రబోధాలను మరియు ఆచారాలను అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు.

ఈనాటి జూడాయిజం వారు అనుకరిస్తున్న అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఒకప్పుడు యూదులు చెరలో జీవిస్తున్నప్పుడు వారిని చెరగా తీసుకుపోయిన అన్యజనుల ఆచారాలలోనుండి అరువుతీసుకున్నవే:

తలిస్మానులు, హంసాలు (హస్తరూప తాయత్తులు), లాగ్ బౌమ (ఒమెర్ 33వ దినాన జరుపుకునే యూదుమత పండుగ), కిప్పా (యూదులు ధరించే పుర్రె టోపి) ధరించటం, మరణించిన ఆత్మలతో షంభాషించే సమావేశాలు, టెఫిలీనులను కట్టుకోవడము, ద్వారబంధాలకు మెజుజాలను వ్రేలాడదీయడము, ప్రసిద్దిగాంచిన రబ్బీల సమాధులపై సాష్టాంగపడటము, మాంసాన్ని మరియు పాలవ్యుత్పత్తులను వేరుచేసే కష్రుత్ నియమాలను పాటించటం, మంత్రజాలాలు, కౌమార ప్రాయపు ప్రారంభ వేడుకలు (బార్ మిట్జ్వ) జరుపుకోవటం, పేరెన్నికగల రబ్బీల చిత్రపటాలను గోడలకు వ్రేలాడదీయడం, మంత్రోచ్చరణలు, మరియు వివాహ వేడుకలలో ద్రాక్షారసాన్ని త్రాగుటకు ఉపయోగించే గాజు పాత్రను పగలగొట్టడం మొదలైనవి.

ఓసారి ఓ జ్ఙాని యిలా అన్నాడు, “రబ్బీలు పెంపొందించిన జూడాయిజాన్ని ఈరోజు మోషే గనుక దర్శిస్తే ఆ మహానుభావుడే దాన్ని ఏకోశనా గుర్తించలేడు!”

ఇది చాలదన్నట్లు వారిలో కొందరు ముఖ్యంగా అన్యజాతులలోనుండి జూడాయిజమును స్వీకరించినవారు క్రొత్తనిబంధన గ్రంథాన్ని అలాగే పరమతండ్రి అభిషేకించి పంపిన మెస్సయ్యను తూలనాడుతు దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంటారు. వారి ప్రయత్నం మధ్యాహ్నపు సూర్యునిపై దుమ్మెత్తిపోసే మూర్ఖుల ప్రయత్నాలను తలదన్నేస్థాయిలో వుంటుంది.

ఇతరుల విశ్వాసాలను ప్రశ్నించటం, పరిశోధించటం, లేక తిరస్కరించటం అన్నవి సభ్యసమాజములో ప్రతివ్యక్తికీ వున్న సాధారణ హక్కులు. కాని, పనిగట్టుకొని ఇతరులను వ్యక్తి దూషణకు గురిచేయటము లేక ఇతరుల విశ్వాసాలను దూషించటము తూలనాడటము అన్నవి సంస్కారవంతులు చేసే పనికాదు. అవి సంస్కారహీనులకు చెందినవి.

మానవాళి రక్షణకై/విమోచనకై పరమతండ్రి చూపిన అపార ప్రేమ యొక్క ప్రత్యక్షతగా తననుతాను పాపపరిహారార్థబలిగా సమర్పించుకున్న మెస్సయ్య అయిన యషువ (యేసు) పై తాము ఎత్తిపోసే దుర్భాషల దుమ్ము తమ కళ్ళలలో, నోటిలో, మరియు బ్రతుకుళ్ళోనే పడుతుందన్న చేదు నిజాన్ని గ్రహించలేని అజ్ఙానాంధులు ఈబాపతు జూడాయిజం వారు!

తమ మతవిశ్వాసాల ప్రచారానికై క్రొత్తనిబంధనను శంకించేందుకు అనువుగా అనేక తర్కరాహిత్యమైన, ద్వంద్వనీతీప్రాయమైన, సాహిత్యపరిజ్ఙానలోపముతోకూడిన ప్రశ్నలు సంశయాలను లేవనెత్తుతు అమాయక క్రైస్తవులను విశ్వాసభ్రష్టులను చేస్తున్నారు. ఇలాంటివారినిగూర్చే క్రొత్తనిబంధనా లేఖనాలు రెండువేల సంవత్సరాలక్రితమే ప్రవచనాత్మకంగా క్రింది మాటలలో హెచ్చరించాయి:

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. (1తిమోతీ.4:1-2)

తమ మోసపూరిత కుతంత్రాలను ప్రయోగించే ప్రయత్నములో వీరు సోషల్ మీడియాను మరిముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను విరివిగా ఉపయోగిస్తుంటారు. తమ విశ్వాసాలతో ఏకీభవించనివారిని వ్యక్తిగత దూషణ చేయటం, ఇతరుల విశ్వాసాలను తూలనాడటం, క్రొత్తనిబంధన లేఖనాలను ఎగతాళిచేయటం, ప్రభువైన యేసు క్రీస్తును దూషించటం వీరి ప్రత్యేక లక్షణాలు. వారి భాషా మరియు పదజాలము పతనావస్తలోవున్న వారి వ్యక్తిగత స్వభావలక్షణాలనేగాక వారిపై ప్రభావాన్ని చూపుతున్న వారి మత స్వభావాన్నికూడా అవగతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఈరకమైన ప్రయత్నాలు ప్రముఖంగా నామకార్థ క్రైస్తవులమధ్య చేయటం ఈ మతవిశ్వాసుల ప్రధాన వ్యూహంగా గమనించగలం.

ఈనాటి క్రైస్తవ్యములో అధిక శాతం నామకార్థ క్రైస్తవులు లేక మతక్రైస్తవులేనన్నది సుస్పష్టం. పొట్టు విస్తారం, గింజలు స్వల్పం! అన్యమతాలనుండి మరియు దుర్బోధకులనుండి క్రైస్తవ సత్యం పై జరుగుతున్న దాడికి అనేకులు కదిలిపోయి నిజక్రైస్తవ్యాన్ని వదిలి నాశనమార్గాలలోకి అడుగిడుతున్నారు. ఇది అనిర్వార్యం. గాలివీస్తేనే పొట్టు గింజలు వేరయ్యేది. గాలికి పొట్టులాంటి క్రైస్తవులు చెదరగొట్టబడ్డప్పుడే స్థిరంగా నిలిచే గింజలలాంటి నిజక్రైస్తవులు గుర్తించబడేది.

ఆయన (మెస్సయ్య) చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.” (లూకా.3:17)

« Older Entries