యూదుమతస్తుల ప్రశ్నలు-10
ధర్మశాస్త్రము నిత్యమైనది- శాశ్వతమైనది???
??2రాజులు 17:37: మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.
??ద్వితియోపదేశకాండము 7:11: కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను.
??ద్వితియోపదేశకాండము 6: 2
నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్ని టను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే.
??ద్వితియోపదేశకాండము 6: 17
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.
??ద్వితియోపదేశకాండము 6: 25
మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.
????????
????కీర్తనలు 111: 7
ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.
?కీర్తనలు 111:8: అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.
??కీర్తనలు 119:142: నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
??కీర్తనలు 119:144: నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
??కీర్తనలు 111:3: ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
కీర్తనలు 111:9: ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.
కీర్తనలు 119:152: నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
??కీర్తనలు 119:160: నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
????????
??ద్వితియోపదేశకాండము 4: 2
మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు
??ద్వితియోపదేశకాండము 12: 32
నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు
??సామెతలు 30: 6
ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
క్రైస్తవ సమాధానాలు
ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసినవి:
అంశము#1
మోషేద్వారా యివ్వబడిన ధర్మశాస్త్రము ప్రధానంగా ఇశ్రాయేలీయులు అనుసరించాల్సిన ఆజ్ఙలు, విధులు, బలులు, నైవేధ్యాలు, ఆచారాలు మొదలైనవి మోషేద్వారా చేయబడిన నిబంధనలోని భాగాలు.
బైబిలులో “నిత్య నిబంధన” [עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం] అన్న పదజాలానికి ప్రత్యేకత వుంది. అది దేవుని సుధీర్ఘకాల వుద్ధేశాన్ని సూచిస్తుంది. ఈ పదజాలము బైబిలులో కొన్ని నిబంధనలకే యివ్వబడింది. అందులో కొన్ని:
- నోవహునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (ఆది.కాం. 9:16)
- అబ్రహామునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (ఆది.కాం.17:7,19; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)
- దావీదునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (2సమూయేలు.23:5)
- క్రొత్తనిబంధన ‘నిత్యనిబంధన’–עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (యెషయా.55:3, 61:8; యిర్మీయ.32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26)
మోషేనిబంధనకు ‘నిత్యనిబంధన’ [עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం] అన్న పదజాలము లేఖనాలు ఎక్కడా అన్వయించలేదు.
పై కారణాన్ని బట్టి మోషేనిబంధనలోని భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రముకూడా అంటే ఇశ్రాయేలీయులు అనుసరించాల్సిన ఆజ్ఙలు, విధులు, బలులు, నైవేధ్యాలు, ఆచారాలు మొదలైనవి నిత్యమైనవి కావు. అవి నిత్యమైనవి మరియు శాశ్వతమైనవి అని లేఖనాలు ఎక్కడా ప్రకటించటము లేదు. అయినా అలా భావించి, విశ్వసించి, ప్రకటించటమన్నది లేఖనవిరుద్ధం మరియు దైవవిరుద్ధం!
అంశము#2
పాతనిబంధనలో [తనాఖ్] ఉపయోగించబడిన హీబ్రూ భాషా పదము ఓలాం [עוֹלָם/olam] కున్న అర్థాలు–నిత్యము, చిరకాలము, సుధీర్ఘకాలము, తరమంతా. అయితే, ఈ పదానికి ‘అంతము లేని’ [నిరంతరము] అన్న భావము లేదు. క్రింది లేఖనాలను పరిశీలిస్తే ఆ విశయము ద్యోతకమవుతుంది:
“వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము (עוֹלָם/ఒలం) వానికి దాసుడైయుండును.” (నిర్గ.కాం.21:6)
“మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా (עוֹלָם/ఒలం) మీకు దాసులగుదురు” (లేవీ.కాం.25:45-46)
“పూర్వదినములను (עוֹלָם/ఒలం) జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.” (ద్వి.కాం.32:7)
“ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు (עוֹלָם/ఒలం) నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.” (కీర్తన.73:12)
“ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని (עוֹלָם/ఒలం) పాడుగాను ఉండజేసెదను.” (యిర్మీయా.25:9)
గమనిక: పై లేఖనాలు హీబ్రూ పదమైన ఓలాం (עוֹלָם/olam) ‘అంతములేని కాలము’ను సూచించటము లేదు అన్నది సుస్పష్టము.
వివరణలు
2రాజులు 17:37 “మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.”
అవును. మోషేద్వారా యివాబడిన ధర్మశాస్త్రాన్ని అంటే గమనించాలి వ్రాసియిచిన ధర్మశాస్త్ర ధర్మమంతా ఇశ్రాయేలీయులు అనుసరించాలి. పై వాక్యములో గమనించాలిసించ అంశాలు:
(1) ధర్మశాస్త్రమంతా అంటే అరకొర అని కాదు. లేక నచ్చినవి వీలైనవి సాధ్యమైనప్పుడు మాత్రమే అని కూడా కాదు! అంతా అన్ని వేళలా
(2) మౌఖికధర్మశాస్త్రము కాదు, వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రము! మోసపోకుడి, మౌఖికధర్మశాస్త్రము లేక మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్నది రబ్బీల స్వంత సృష్టి!
ద్వితియోపదేశకాండము 7:11: “కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను.”
అవును. తన ఎదుట నిలిచియున్న ఇశ్రాయేలీయులను వారి భావితరాలను మోషే తాను యిస్తున్న ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవాలి అన్నది వివరిస్తున్నాడు.
ద్వితియోపదేశకాండము 6: 2 “నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే.”
అవును, మోషే ఆజ్ఙాపిస్తున్నట్లుగా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించబోతున్న ఇశ్రాయేలీయులందరు తమ జీవితకాలమంతా అనుసరించాలి. దీనిభావము మోషేధర్మశాస్త్రము నిరంతరము లేక అంతములేని కాలవ్యవధి అంతా పాటించబడుతుంది అని కాదు!
ద్వితియోపదేశకాండము 6: 17 “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.”
మోషేధర్మశాస్త్రము క్రింద జీవించే వారంతా ఆ ధర్మశాస్త్రములోని వాటన్నిటిని పాటించాలి. దీనిభావం కూడా మోషేధర్మశాస్త్రము నిరంతరము లేక అంతములేని కాలవ్యవధి అంతా పాటించబడుతుంది అని కాదు!
ద్వితియోపదేశకాండము 6: 25 “మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.”
పై వాక్యము ప్రకటిస్తున్న విశయము: మోషేధర్మశాస్త్రము క్రింద జీవించే వారంతా అందులోని ఆజ్ఙలన్నింటిని అనుసరించి నడుచుకుంటేనే వారు నీతిని పొందటము జరుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే, మోషేధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న వారు ధర్మశాస్త్రములోని అరకొర పాటించటముద్వారానో లేక తమకు వీలైనవాటిని పాటించటముద్వారానో లేక సాధ్యమైనప్పుడు పాటించటముద్వారానో నీతిని పొందజాలరు, శాపగ్రస్తులుగానే కొనసాగి నాశనములోకి ప్రవేశిస్తారు.
కీర్తనలు 111: 7 “ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.”
అవును, ఆమేన్!
కీర్తనలు 111:8: అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.
అవును, ఆమేన్!
కీర్తనలు 119:142: నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
అవును, ఆమేన్! మోషేద్వారా యివ్వబడిన దేవుని ధర్మశాస్త్రము సత్యము, అసత్యము కాదు! దేవుడు ఆదాము హవ్వలను మంచిచెడులను తేలియచేసె పండ్లను తినవద్దని ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙ సత్యము. అయినా అది యిప్పుడు వర్తించదు; అమలులో లేదు.
కీర్తనలు 119:144: నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
అవును, ఆమెన్!
కీర్తనలు 111:3: ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
అవును, ఆమెన్!
కీర్తనలు 111:9: ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.
అవును, ఆమెన్!
ఉదాహరణ: “ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] పాడుగాను ఉండజేసెదను.” (యిర్మీయా.25:9)
కీర్తనలు 119:152: నీ శాసనములను నీవు నిత్యములుగా [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
అవును. దేవునికి మహిమ కలుగును గాక!
కీర్తనలు 119:160: “నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] నిలుచును.”
ఆమెన్! ఉదాహరణకు, ఆయన నియమించిన న్యాయవిధులన్నింటిలో ఒకటి “మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెననెను.” (ని.కాం.16:16) ఈ ఆజ్ఙ సత్యము. కాని, ఈ ఆజ్ఙ ఇప్పటికీ ఇశ్రాయేలీయులకు వర్తిస్తుందా…? లేదు. కారణం, ఆ ఆజ్ఙ మన్నాను గురించినది, ఆ కాలానికి చెందినది. అది సత్యమేగాని, ఈ కాలానికి వర్తించదు.
ద్వితియోపదేశకాండము 4: 2 “మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు.”
అవును, యిది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఙ. దేవుడు మోషేద్వారా యిశ్రాయేలీయులకు అందించిన ధర్మశాస్త్రానికి కలుపకూడదు లేక అనుదులోనుండి తీసివేయకూడదు. అయినా, యూదు మతపెద్దలైన రబ్బీలు మోషేధర్మశాస్త్రానికి కేవలం మాటలను మాత్రమే కాకుండా ఏకంగా గ్రంథాలనే వ్రాసుకొని [మౌఖిక తోరాహ్] కలుపుకున్నారు. వారు చేసింది పై స్పష్టమైన ఆజ్ఙకు ప్రతికూలమైన పాపము. వారేగాక వారి మతములో చేరిన వారందరు ఆ పాపాన్ని బట్టి నాశనములోకి వెళ్ళుతున్నారు.
ద్వితియోపదేశకాండము 12: 32 “నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.”
మోషేనిబంధనలో పాలు పొంది మోషేధర్మశాస్త్రము క్రింద జీవించేవారంతా అందులో మోషే ఆజ్ఙాపించిన ‘ప్రతి మాటను’ అనుసరించాలి. దయచేసి జ్ఙాపకముంచుకోండి, ప్రతి మాట అంటే మీకు నచ్చినవో లేక వీలైనవో లేక సాధ్యమైనవో అని కాదు. అన్నీ అని. అయితే సమస్య ఏమిటంటే అన్నీ పాటించే వ్యక్తి ఈ భూలోకములో వున్నాడా…? పాటించని వ్యక్తులంతా శాపగ్రస్తులని మరవకండి.
సామెతలు 30: 6 “ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.”
అవును దేవుని లేఖనము సెలవిస్తున్న ప్రకారము దేవుని మాటలకు ఏనరుడు తన స్వంత మాటలను చేర్చకూడదు. దేవుని మాటలకు దేవుడే తన ప్రవక్తలద్వార అలాగే మెస్సయ్య మరియు ఆయన అపోస్తలులద్వారా ప్రగతిశీల ప్రత్యక్షతగా [Progressive Revelation] యివ్వబడిన తన సందేశములో భాగంగా మోషేధర్మశాస్త్రానికి వేరైన మాటలను చేర్చగలడు. కాని, ఇశ్రాయేలీయులలోని రబ్బీలు తమకు దేవుడు యివ్వని అధికారాన్ని చూపిస్తూ మోషేద్వారా యివాబడిన తోరాహ్ కు వేరుగా మరొక తోరాహ్ అంటే మౌఖిక తోరాహ్ ను చేర్చుకొని పై లేఖనానికి విరుద్ధంగా పాపము చేసారు. ఆ పాపములో జుడాయిజములోని వారంతా పాలుపొందుతున్నారు!