మెస్సయ్య: దేవుని మర్మము
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. కాని, ఆయన కేవలం ఒక నరుడు మాత్రమే అయితే వచ్చే సమస్యలు:
i. పాపులలో ఒకనిగా అయ్యుండేవాడు [1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20; రోమా.3:23; 5:12]
ii. దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండగలిగేవాడు కాదు [1సమూయేలు.2:25; యోబు.9:32-33; కీర్తన.49:7-9; యెహెజ్కేలు.14:14,20;]
iii. ఒక్క మానవున్నికూడా రక్షించలేకపోయేవాడు [కీర్తన.49:7-9]
iv. మానవ జన్మకు ముందు ఉనికిని కలిగి ఉండేవాడు కాదు [మీకా.5:2; యోహాను.3:13; 6:38, 46, 51, 62; 8:23, 58; హెబ్రీ.7:3, 10:5; 1యోహాను.1:1-2; ]
v. దేవుని మందిరముకన్నా గొప్ప స్థానాన్ని కలిగివుండేవాడు కాదు [మత్తయి.12:6]
vi. దేవునిగా గుర్తించబడేవాడు కాదు [యోహాను.1:1,14, 20:28; హెబ్రీ.1:8]
vii.దేవునికి చెందిన ఘనత, ఆరాధన అందుకునేవాడు కాదు [మత్తయి.28:9,17; ప్రకటన 5:8-14]
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. అయితే, అంతేగాక ఆయన అదే సమయములో క్రిందివన్నీకూడా అన్నది మరువకూడదు:
i. దేవుని రూపం [*μορφή/మోర్ఫె = form (ఫిలిప్పీ.2:6)]
ii దేవుని ప్రతిరూపం [+εἰκών/ఎయికోన్ = image (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)]
iii దేవుని శక్తి [1కొరింథి.1:24]
iv. దేవుని జ్ఙానం [1కొరింథి.1:24]
v. దేవుని వాక్కు [యోహాను.1:1,14]
vi. దేవుని మహిమాతేజస్సు [హెబ్రీ.1:3]
vii.దేవుని కుమారుడు [సామెతలు.30:4; యోహాను.3:16; 1యోహాను.3:8]
ఒకే వ్యక్తిలో కేంద్రీకృతమైయున్న పై విభిన్న వాస్తవాల సమాహారాన్నిబట్టి క్రీస్తుగా వచ్చిన యేసు దేవుని మర్మమై [μυστήριον/ముస్టెరిఒన్ = mystery] యున్నాడు:
“నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.” (కొలొస్సీ.2:1).
ఈ లేఖన సత్యాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం (1కొరింథి.2:14). దేవుని సంబంధులైనవారు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్న గ్రహింపులో ఎదుగుతున్న తరుణములో తమ గ్రహింపుకు అతీతమైన లేఖన సత్యాలను తిరస్కరించక మరియు తప్పుబట్టక విశ్వాసముతో స్వీకరించగలుగుతారు.
పై లేఖనాల వెలుగులో నిజవిశ్వాసులు, దైవసంబంధులు ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యెడల సరియైన దృక్పథాన్ని కలిగి వుండటమేగాక ఆయనను వాక్యాధారమైన విధానములోనే ఘనపరచగలరు.
ఈ సందర్భంగా నిజీవిశ్వాసులు జ్ఙాపకముంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విశయం, తండ్రిని ఒకవిధంగా కుమారుని మరొకవిధంగా ఘనపరచమన్నది లేఖన బోధ కాదు అన్న సత్యం. తండ్రిని ఏవిధంగా ఘనపరచాలో అదేవిధంగా కుమారుని ఘనపరచాలి అన్నది లేఖనము యొక్క సుస్పష్టమైన బోధ మరియు ఆజ్ఙ. ఈ ఆజ్ఙను అతిక్రమించినవాడు తండ్రిని అగౌరపరచినవాడవుతాడు. అలాంటివాడే దుర్బీజుడు మరియు క్రీస్తు/మెస్సయ్య విరోధి:
“తండ్రిని ఘనపరచునట్లుగా [καθὼς/కాతొస్ = same as; just as; even as] అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” (యోహాను.5:23)
గమనిక:
*మోర్ఫె [μορφή] = రూపం [form]; ఆకారం [shape]; బయటికి అగుపడునది [outword appearance]:
- బయటికి అగుపడునది [outword appearance] మర్కు.16:12
- రూపం [form] ఫిలిప్పీ.2:6
- ఆకారం [shape] ఫిలిప్పీ.2:7
+ఎయికోన్ [εἰκών] = బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon]; ప్రతిబింబము/ప్రతిరూపం [image]; ప్రాతినిథ్యము [representation]:
- బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon] మత్తయి 22:20; రోమా.1:23; ప్రకటన.13:14
- ప్రతిబింబము [image] 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15
- ప్రాతినిథ్యము [representation] రోమా.8:29; 1కొరింథీ.11:7, 15:49; 2కొరింథీ.3:18; కొలొస్సీ.3:10
Thanks for insights… Jesus is God.