యూదుమతస్తులకు ప్రశ్నలు-8
యెషయలోని ‘నా సేవకుడు’ ఎవరు?
జూడాయిజములోని వారలారా, మీ విశ్వాసము ప్రకారం జుడాయిజం క్రైస్తవ విశ్వాసానికన్న ముందున్నది. అంటే, మొదట జూడాయిజం తరువాత క్రైస్తవ్యం!
కనుక, మొదట మీరు క్రింది ప్రశ్నలకు జూడాయిజం దృక్కోణములో సమాధానాలు చెప్పి అటుతరువాతే క్రైస్తవులకు ఆ ప్రశ్నలను వేయండి:
??(1) యెషయా 53 లోని “నా సేవకుడు” అంటే ఎవరు…?
??(2) దేవుడు నరబలిని యివ్వకూడదని నరులకు ఆజ్ఙాపించాడు. అయితే, తాను కూడా నరబలిని యివ్వకూడదు అనిగాని లేక తాను నరబలిని యివ్వబోవడము లేదు అనిగాని లేఖనములో ఎక్కడ తెలియజేసాడు…?
??(3) “నా సేవకునికి” ఏ వ్యాధి వచ్చింది…?
??(4) “నా సేవకుడు” కొల్లసొమ్మును ఎవరితో కలిసి పంచుకున్నాడు…?
??(5) “నా సేవకుడు” తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము ఎప్పుడు చూచింది…?
??(6) “నా సేవకుడు” జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను ఎప్పుడు నిర్దోషులుగా చేసాడు…?
??(7) “నా సేవకుడు” అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి ఎప్పుడు, ఎక్కడ విజ్ఞాపన చేసాడు…?
జూడాయిజంకు చెందిన మీరు క్రైస్తవులను డిమాండు చేస్తున్న విధంగానే లేఖనాలను చూపిస్తూ పై ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. అలా చేయని పక్షములో మీరు మీకే చాతకాని వాటిని యితరులు చేయాలంటూ శరతులు పెడుతున్నారు. అది వేశధారణ!
మీరు చేయగలిగిందే యితరులను చేయమని కోరాలి, అంతేగాని మీచేత కాలేనిదాన్ని యితరులు చేయాలని సూచించటం మీరు వేశధారులను ద్వంద్వనీతిపరులని నిరూపిస్తుంది.